WestGodavari

News April 21, 2024

ఉండి బరిలో వీరే.. గెలుపు ఎవరిదో..?

image

ఉండి కూటమి అభ్యర్థిపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ నేటితో వీడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామ కృష్ణ రాజును ప్రకటించారు. దీంతో ఈ స్థానంలో ముగ్గురు రాజుల మధ్య పోటీ నెలకొననుంది.  రఘురామ కృష్ణరాజు కూటమి నుంచి, వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు, స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకటశివరామరాజు నిలిచారు. మరి గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే..?

News April 21, 2024

ఉండి టీడీపీ కంచుకోట.. గెలిచి తీరుతా: RRR

image

ఉండిలో ఎంతమంది అడ్డొచ్చినా MLAగా గెలిచి తీరుతానని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతులమీదుగా ఉండి అభ్యర్థిగా బీఫాం అందుకున్న రఘురామ.. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. ఉండిలో మంతెన రామరాజుతో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. ఉండి టీడీపీ కంచుకోట అని, టీడీపీ-జనసేన్-బీజేపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లి జెండా ఎగురవేస్తానని అన్నారు.

News April 21, 2024

టీడీపీ నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా రామరాజు

image

టీడీపీ నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండి MLA మంతెన రామరాజును నియమిస్తూ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఉన్న సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఉమ్మడి ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించడంతో మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు.

News April 21, 2024

రేపు నామినేషన్ వేయనున్న రఘురామకృష్ణరాజు

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరు రఘురామకృష్ణరాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెదమిరం గ్రామంలోని ఆయన స్వగృహం నుంచి ఉండి ఎమ్మార్వో ఆఫీస్, ఎన్నికల అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News April 21, 2024

బీసీ యువజన పార్టీ MLA అభ్యర్థుల మూడో లిస్ట్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ యువజన పార్టీ తరఫున పోటీ చేయనున్న MLA అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిప్పేటి వడ్డీకాసులు, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమ గోపాల్, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.నిరీక్షణ రావును బరిలో దింపుతున్నట్లు పేర్కొన్నారు.

News April 21, 2024

ఈనెల 23న ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్

image

ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఈనెల 23న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 23న ఉదయం 9 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

News April 21, 2024

ఏలూరు ఆశ్రంకు ఐఎస్ఓ గుర్తింపు

image

ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఆశ్రం)కు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్డాండర్డ్‌రైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు దక్కినట్లు డైరెక్టర్‌ జి.రతీదేవి తెలిపారు. ఆశ్రంలో అందుబాటులోకి తెచ్చిన ప్రపంచస్థాయి సౌకర్యాలు, వైద్య సేవలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, శక్తి, పర్యావరణ అనుకూల వ్యవస్థకు ఐఎస్‌ఓ 5 సర్టిఫికెట్లు అందించిందన్నారు.

News April 21, 2024

నేడు ప.గో.లో పవన్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప.గో జిల్లాలో
పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో  ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ముత్యాలపల్లి, లోసరి, బర్రెవానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం పట్టణానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్‌లో జరిగే బహిరంగ సభలో వారాహి పైనుంచి మాట్లాడుతారు. రాత్రి స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్‌హాల్‌లో బస చేస్తారు.

News April 21, 2024

యాదవులకు వైసీపీలో సముచిత స్థానం: మంత్రి కొట్టు

image

వైసీపీలో యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించామని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలో యాదవ సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులిచ్చి సీఎం జగన్ గౌరవించారన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, సంపత్ కుమార్ పాల్గొన్నారు.

News April 20, 2024

అనుమానం.. భార్య, పిల్లలను లోపల వేసి ఇంటికి నిప్పు

image

అనుమానంతో భార్య, పిల్లలను లోపల ఉంచి ఇంటికి నిప్పుపెట్టాడో భర్త. ఈ ఘటన భీమడోలులో జరిగింది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. అర్జావారిగూడెంకు చెందిన నాగరాజు-వెంకటలక్ష్మికి 2009లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాగరాజు అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఈనెల 15న భార్య, పిల్లలను ఇంట్లో వేసి నిప్పు పెట్టాడు. వారు కేకలేస్తూ తలుపులు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.