WestGodavari

News April 19, 2024

ఆళ్ల నాని ఆస్తులు, అప్పులు ఎంతో తెలుసా..?

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా అఫిడవిట్‌లో చరాస్తులు రూ.1,39,96,885, స్థిరాస్తులు రూ.55,60,650 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట చరాస్తులు రూ.72,69,897, స్థిరాస్తులు రూ.5,92,29,200గా పొందుపరిచారు. అప్పులు ఆయన పేరిట రూ.27,51,846, భార్య పేరున రూ.9,45,100 ఉన్నాయన్నారు.

News April 19, 2024

ప.గో.జిల్లాలో ఒకటి.. ఏలూరు జిల్లాలో 6

image

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏలూరు జిల్లాలో ఆరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమలో రాజకీయ సందడి తారస్థాయికి ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం, పాదయాత్రలతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

News April 19, 2024

ప.గో.: పెరిగిన వర్జీనియా పొగాకు ధర

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు ధరలు గురువారం పుంజుకున్నాయి. A-గ్రేడ్‌ ధరలు గురువారం కిలో రూ.250 మార్క్‌ను క్రాస్‌ చేసింది. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో గరిష్ఠ ధర రూ.255, జంగారెడ్డిగూడెం కేంద్రం-1లో రూ.257, జంగారెడ్డిగూడెం కేంద్రం-2లో రూ.251, కొయ్యలగూడెంలో రూ.255, గోపాలపురంలో రూ.254 ధర పలికింది.

News April 19, 2024

ప.గో.: నామినేషన్లు START.. ఖరారవ్వని కూటమి అభ్యర్థి

image

నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైనప్పటికీ ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకుండా ఉంది. ఓ వైపు నియోజకవర్గంలోని ఆకివీడులో మంతెన రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ RRR ఈ నెల 22న నామినేషన్ వేస్తానని.. ఏస్థానం నుంచి అనేది తర్వాతనే చెబుతానని ఇటీవల ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు తమ నాయకుడికి టికెట్ వస్తుందో లేదోనన్న సంశయంలో ఉన్నారు.
– మీ కామెంట్..?

News April 19, 2024

ప.గో.: సెంటిమెంట్.. ఇక్కడికెళ్తే ఎన్నికల్లో గెలుపు పక్కా

image

ఎన్నిక ఏదైనా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే నాయకులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ప్రచారం ప్రారంభించేందుకు ముందు నాయకులు మండలంలోని నందమూరులో కొలువైన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని విశ్వాసం. మాజీ CM జలగం వెంగళరావు గతంలో ఏడాదికి ఒకసారైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
– మీ ప్రాంతాల్లో ఇలా ఏదైనా సెంటిమెంట్ ఉందా..?

News April 19, 2024

ఏలూరు జిల్లాలో రూ.6,52,000 నగదు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 145.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా.. దాని విలువ ₹.4,340 ఉంటుందన్నారు. అలాగే FST వారు స్వాధీనం చేసిన నగదు ₹.6,52,000 ఉన్నట్లు తెలిపారు.

News April 19, 2024

సీఎం కాన్వాయ్‌లో మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం

image

సీఎం జగన్ బస్సు యాత్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో లేని విధంగా సీఎం కాన్వాయ్ లో డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటు చేశారు. గురువారం తణుకు నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్రలో ఈ విధానం ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే కాన్వాయ్ కు ముందుగా రెండు కిలోమీటర్ల మేర ఫొటోలు, వీడియోలః ద్వారా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ సిస్టం ద్వారా కలుగుతుంది.

News April 18, 2024

జనసేనాని ఉమ్మడి ప.గో పర్యటన షెడ్యూల్ ఖరారు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీన భీమవరం, నరసాపురం.. 22వ తేదీన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు.. 30వ తేదీన పోలవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 18, 2024

జనసేన తీర్థం పుచ్చుకున్న వట్టి పవన్ కుమార్

image

మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.

News April 18, 2024

ముద్రగడ ఓ పెద్ద దరిద్రం: నటుడు పృథ్వీరాజ్

image

పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.