India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమవరం గునుపూడిలోని బాలికల హాస్టల్‌లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RRDS ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అమూల్యరావు మాట్లాడుతూ.. చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్ట పడతారని అన్నారు. చాక్లెట్ రుచుల్లో మొత్తం 600 రకాలున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.
☛ ఇంతకీ మీకు ఏ చాక్లెట్ ఇష్టం..?
ప.గో. జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పాలకొల్లులో శనివారం నిర్వహించిన సమీక్షలో అధికారులతో ఆయన చర్చించారు. డ్రెయిన్లకు సంబంధించి 35, పంట కాల్వలకు సంబంధించి 55 పనులను చేయడానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినందున తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.
ఏలూరు అమీనాపేట ప్రాంతంలో రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరు మండల డిప్యూటీ తహశీల్దార్ లామ్ విద్యాసాగర్‌పై నగరానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శనివారం ఇంటి నుంచి కార్యాలయానికి బైక్‌పై వెళ్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన సదరు వ్యక్తి తహశీల్దార్‌ను అడ్డుకొని దాడి చేసినట్లు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప.గో. జిల్లాలోని DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సి.నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలంతా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు జీవనోపాధి మార్గాలను ఎంచుకొనేలా చొరవ చూపాలన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సహాయం తీసుకొని రానున్న రెండు నెలలల్లో బలోపేతం చేయాలని ఆదేశించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి VRA పసుపులేటి మోహన్‌రావు శుక్రవారం అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోహన్‌రావు సేవలు మరువలేనివని అన్నారు.
నల్లజర్ల జాతీయ రహదారిలో ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే TPG ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ తెలిపారు. 2019-2024లో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన 18-25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ కోసం రేబిస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని కోరారు. రేబిస్ లక్షణాలున్న పెంపుడు జంతువు కరిస్తేనే కాకుండా వాటి చొంగ వల్ల కూడా రేబిస్ సోకుతుంది.
పాలకొల్లులోని లంకలకోడేరు సచివాలయం-2లో గ్రేడ్-5 సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న బి.రాము ఈ నెల ఒకటో తేదీన పింఛన్ సొమ్ము రూ.2.50 లక్షలతో పరారైన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సెల్ సిగ్నల్ ద్వారా HYDలో రామును పట్టుకుని అధికారుల ముందు శుక్రవారం హాజరుపర్చారు. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా గతంలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. విచారణలో సీఐ సతీష్, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.