WestGodavari

News July 6, 2024

గోదావరిలో పెరుగుతున్న వరద నీరు

image

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులు, కొండవాగులు పొంగి వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం నాటికి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఎగువన 26.470 మీటర్లు, స్పిల్వే దిగువన 16.350 మీటర్లు, ఎగువ కాపర్ డ్యామ్ ఎగువన 26.530 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ దిగువన 15.330 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.

News July 6, 2024

ప.గో: ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్

image

నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.

News July 6, 2024

జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి: మంత్రి

image

మాజీ సీఎం జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో పడ్డాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం సీఈ, ఎస్ఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలన‌లో జలవనరుల శాఖ 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చెప్పారు. వర్షాకాలానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News July 5, 2024

జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి: మంత్రి నిమ్మల

image

EVM బద్దలు కొట్టడం తప్పు కాదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం దారుణమని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమేనని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ధ్వంసంపై, జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేలా ఈసీ సుమోటోగా కేసును టేకప్ చేయాలని కోరారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News July 5, 2024

ప.గో.: నర్సు ఆత్మహత్యాయత్నం

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కడగట్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి మమత ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మమత స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. యువతి స్వగ్రామం నిడదవోలు. ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సుధాకర్ పరిశీలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

ఏలూరులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

image

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బిర్లా భవన్ సెంటర్‌లో ఉన్న ఓ మెడికల్ షాప్ దగ్ధం అయింది. ఈ ఘటనలో షాపులోని మందులన్నీ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా..? మరేదైనా కారణమా..? తెలియాల్సి ఉంది.

News July 5, 2024

కుటుంబ తగాదాలు.. గోదావరిలో దూకి సూసైడ్

image

దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మెరిపో కిషోర్(33) గురువారం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్.. రోడ్డు కం రైలు వంతెనపై మోటారు సైకిల్, చెప్పులు విడిచిపెట్టి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి మృతదేహం లభ్యమైంది.

News July 4, 2024

ఖత్తర్‌లో మృతిచెందిన ప.గో. జిల్లావాసి

image

ప.గో. జిల్లా పోడూరు మండలం గుమ్ములూరు గ్రామానికి చెందిన షేక్ బాషా, కుమారుడు వలీ ఉపాధి నిమిత్తం ఖత్తర్ దేశం వెళ్లారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి వారు నివసిస్తున్న గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో షేక్ బాషా (46) మృతి మృతి చెందగా కుమారుడు వలీ చేతులు కాలిపోగా అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 4, 2024

ప.గో.: టెండర్లకు ఆహ్వానం: జాయింట్ కలెక్టర్

image

తాడేపల్లిగూడెంలోని పురుగు మందుల పరీక్ష ల్యాబ్‌కు కావలసిన మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప.గో. జిల్లా JC ప్రవీణ్ ఆదిత్య అన్నారు. కలెక్టరెట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల బిడ్డర్లు ఈఎండీ మొత్తం రూ.2 లక్షల నగదును జూలై 16 మధ్యాహ్నం 12 గంటలలోపు డీడీ లేదా బ్యాంక్ చెక్ రూపంలో కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News July 4, 2024

గోపాలపురం: ACCIDENT.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం దొండపూడిలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని ఊట్లగూడేనికి చెందిన సురేశ్(27), స్నేహితుడు రాంప్రసాద్‌తో కలిసి బైక్‌పై గోపాలపురం వెళ్తున్నారు. దొండపూడి వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఇద్దరికీ గాయాలవగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేశ్ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు SI సతీశ్ చెప్పారు.