WestGodavari

News July 24, 2024

ప.గో: విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు

image

ఉమ్మడి ప.గో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు ఓ ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై రెండు పేజీలకు మించకుండా వ్యాసం రాసి స్కూలు హెచ్ఎం ధ్రువీకరణతో ఆగస్టు 10వ తేదీలోగా కార్యదర్శి, జిల్లా సర్వోదయ మండలి, గాంధీ కస్తూర్బా భవనం, శ్రీరాంపురం, భీమవరం-2 చిరునామాకు పోస్టులో పంపాలన్నారు.

News July 24, 2024

ప.గో: వ్యవసాయాభివృద్ధికి రూ.50 కోట్లు

image

కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడంతో అన్నదాతలు ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్లతో కాలువల ఆధునికీకరణ, ఏటిగట్ల ప్రతిష్ట, రెగ్యులేటర్ల మరమ్మతు పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. అటు ప్రకృతి వ్యవసాయ రంగంలో యువతను భాగస్వామ్యం చేసేలా అడుగులు వేయనుంది.

News July 24, 2024

విధుల్లో అలసత్వం.. డ్రెయిన్ల శాఖ ఈఈ సస్పెండ్

image

భారీ వర్షాలు.. వరదల వేళ విధుల్లో అలసత్వం వహించి గోస్తని డ్రెయిన్‌‌కు గండి పడటానికి కారణమైన డ్రెయిన్ల శాఖ ఈఈ MVV కిషోర్‌ను ప.గో కలెక్టర్ సి.నాగరాణి మంగళవారం సస్పెండ్ చేశారు. పాలకోడెరు మండలం మోగల్లు వద్ద గోస్తని డ్రెయిన్‌కు గండి పడటానికి ఈఈ పర్యవేక్షణ లోపం, సరైన ముందస్తు చర్యలు లేకుండా బాధ్యతా రాహిత్యంతో ఉండటమే కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 24, 2024

నిడదవోలు: వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

నిడదవోలులోని తీరుగూడెంలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసినట్లు ఎస్ఐ పులపా అప్పారావు తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఆంజనేయపురానికి చెందిన ఓ విటుడు, రాజమహేంద్రవరానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

తాడేపల్లిగూడెంలో YS షర్మిల పర్యటన నేడు

image

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం (నేడు) తాడేపల్లిగూడెం మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి అంకెం సీతారాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నందమూరు గ్రామంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారని చెప్పారు.

News July 24, 2024

CWC ఛైర్మన్‌ను కలిసిన మంత్రి నిమ్మల

image

CWC ఛైర్మన్ కుష్వీందర్ వోహ్రాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల గురించి మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.

News July 23, 2024

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన RRR

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మంత్రి నారా లోకేశ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించారు.

News July 23, 2024

మంత్రి నిమ్మలను సత్కరించిన కేంద్ర మంత్రి

image

పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర సాయం కోరేందుకు వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడును ఢిల్లీ ఆంధ్రభవన్‌లో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, పలువురు టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.

News July 23, 2024

ప.గో.: వరద నీటిలోనే మృతదేహాన్ని మోస్తూ..

image

కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని పోచవరంలో జరిగిన ఓ ఘటన కన్నీళ్లు పెట్టించింది. భారీ వర్షాలకు గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన శ్మశానవాటిక వరదనీటిలో మునిగిపోయింది. మంగళవారం గ్రామంలోని దళితవాడలో ఓ వ్యక్తి చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు మృతుడి బంధువులు ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు వరద నీటిలోనే శ్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

News July 23, 2024

పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం వివరాలు

image

పశ్చిమగోదావరి జిల్లాలో వర్షపాత వివరాలను మంగళవారం అధికారులు వెల్లడించారు. తణుకు 1.0, పెంటపాడు, గణపవరం, ఆచంట 0.8, ఉండి 0. 6,అత్తిలి 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లా మిగిలిన మండలాలో వర్షపాతం నమోదు కాలేదు. మొత్తం జిల్లాలో 4.2వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 0.2 మిల్లీ మీటర్లు అని అధికారులు తెలిపారు.