WestGodavari

News July 2, 2024

పోలవరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. సోమవారం ఉదయానికి స్పిల్‌వే ఎగువన 25.700 మీటర్లు, దిగువన 15.700 మీటర్లు, కాపర్‌ డ్యాంనకు ఎగువన 25.750 మీటర్లు, దిగువన 14.400 మీటర్ల నీటి మట్టం నమోదైంది. అదనంగా వచ్చిన 29,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఈఈ వెంకటరమణ తెలిపారు.

News July 2, 2024

నేడు భీమవరంలో ‘ కల్కి’ మూవీ బుజ్జి కారు

image

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరో ప్రభాస్ నడిపిన బుజ్జి కారును భీమవరం మల్టీప్లెక్స్ ఆవరణలో మంగళవారం ప్రదర్శించనున్నట్లు థియేటర్ యాజమాన్యం సోమవారం రాత్రి తెలిపింది. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఈ బుజ్జి కారు ఉంటుందని తెలిపారు.

News July 2, 2024

ప.గో జిల్లాలో 95.42% పెన్షన్ల పంపిణీ

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. మొత్తం జిల్లాలో పెన్షన్‌దారులు 2,32,885 మందికి గాను 2,22,221 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News July 2, 2024

ఏలూరు జిల్లాలో 95.42% పెన్షన్ల పంపిణీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. జిల్లాలోని మొత్తం పెన్షన్‌దారులు 2,68,353 మందికి గానూ 2,56,331 మందికి అందజేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

News July 1, 2024

ప.గో: యువకుడి మిస్సింగ్.. గోదావరిలో గాలింపు

image

ఫంక్షన్‌కని చెప్పి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ప.గో జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లికి చెందిన వై.త్రిమూర్తులు పంక్షన్‌కు వెళ్తున్నానన చెప్పి ఆదివారం ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడం.. బైక్ నరసాపురంలోని స్మశానవాటిక దగ్గరలో ఉండటంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాలర్లతో పడవ సాయంతో గోదావరిలో వెతికించారు.

News July 1, 2024

ప.గో: కాపు కాసి యువకుడిపై దాడి.. రంగంలోకి DSP

image

తణుకు మండలం కొమరవరంలో ఇటీవల యువకుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన ఘటనపై తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి సోమవారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేడే రాంమూర్తి బైక్‌పై వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, సాయిలు గత నెల 26న దారి కాచి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తణుకు రూరల్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News July 1, 2024

ఏలూరు: ఆసుపత్రికి వెళ్లి మరీ పెన్షన్ అందజేత

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన కొవ్వలి రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది అడారి చందు, శివ శంకర్, కూటమి నేతలు తొలి రోజున ఎలాగైనా రాజుకు నగదు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో ఏలూరులోని ఆసుపత్రికి వెళ్లి మరీ పెంచిన పెన్షన్ అందించారు. ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News July 1, 2024

కలెక్టర్ చదలవాడ నాగరాణికి కలిసిన RRR

image

పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజవర్గ సమస్యలను కలెక్టర్ నాగరాణికి వివరించారు.

News July 1, 2024

ప.గో.: జడ్పీ కార్యాలయ పరిపాలనాధికారి మృతి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పని చేస్తున్న చిర్రావూరి రత్న గిరి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News July 1, 2024

ఏలూరు: పింఛన్ నిరాకరించిన మహిళ

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.