WestGodavari

News March 25, 2024

కోటవాని చెరువులో యువకుడి డెడ్‌బాడీ

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పరిధిలోని కోటవాని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకు చెందిన సాయి రమేష్ కొంతకాలంగా ఉంగుటూరు మండలం సీతారాంపురంలో ఉంటున్నారు. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెరువులో మృతదేహం తేలగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

News March 25, 2024

ప.గో: నారా భువనేశ్వరి మలి విడత యాత్ర షెడ్యూల్

image

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ మలి విడత యాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం పోలవరం, చింతలపూడి.. బుధవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరం.. గురువారం నూజివీడు, పెనమలూరు, గుడివాడలో ఆమె పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో (SEP) మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ఈ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

News March 25, 2024

ఏలూరులో ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ

image

ఏలూరులోని రామచంద్ర కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం యాక్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2024

ఉమ్మడి ప.గో జనసేన అభ్యర్థుల విద్యార్హతలు

image

ఉమ్మడి ప.గోలోని 15స్థానాలకు ‘కూటమి’ తరపున జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వారి విద్యార్హతలేంటో చూద్దాం.
☞ పోలవరం- చిర్రి బాలరాజు(బీఏ) (2వసారి బరిలో)
☞ నరసాపురం-బొమ్మిడి నాయకర్(డిగ్రీ) (2వ సారి బరిలో)
☞ ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు(ITI ఎలక్ట్రికల్) (తొలిసారి బరిలో)
☞ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్(బీకాం) (2వసారి బరిలో)
☞ భీమవరం- పులపర్తి రామాంజనేయులు (ఇంటర్) (4వసారి పోటీ)

News March 25, 2024

లవ్ మ్యారేజ్.. మరో ఎఫైర్ పెట్టుకొని భార్యకు వేధింపులు

image

భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై ఉండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉండికి చెందిన సూరిబాబు, జ్యోతి 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు బానిసైన సూరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని భార్య ఆదివారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 24, 2024

గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL

image

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?

News March 24, 2024

జంగారెడ్డిగూడెం: 26న నారా భువనేశ్వరి రాక

image

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత భీమడోలు వెంకన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి వస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తెలిపారు. నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు.

News March 24, 2024

ఏలూరులో సైబర్ మోసం.. రూ.92,650 ఫట్

image

బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఓ సైబర్ కేటుగాడు డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. ఇంద్రప్రస్థకు చెందిన బదులు వెంకటేశ్వరప్రసాద్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ అధికారినంటూ నమ్మబలికాడు. క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ వివరాలు తెలుసుకొని వెంకటేశ్వరప్రసాద్ ఖాతాలోంచి రూ.92,650 కాజేశాడు. వెంటనే బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2024

ఏలూరులో మంత్రి కొడుకు Vs మాజీ మంత్రి అల్లుడు

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులెవరో తేలింది. ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏలూరు స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ బరిలో ఉండగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌కు TDP టికెట్ ఇచ్చింది. వీరిద్దరిదీ బీసీ సామాజికవర్గమే. మరి వీరిలో ఎవరూ సత్తా చాటేనో చూడాలి.

News March 24, 2024

కోడలిని తమకు అప్పగించాలని ఎస్పీకి అత్త ఫిర్యాదు

image

తమ కోడలిని తమకు అప్పగించాలని ఓ అత్త ఏలూరు SPకి ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన సురేష్ Febలో లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి పేరెంట్స్‌కి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఓ న్యాయవాది వద్ద కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈనెల 22న ఆ న్యాయవాది ఇంటి నుంచి యువతిని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని, దాంతో సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.