India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. తొలి రోజు తెలుగు పరీక్షకు 23,120 మందికి గాను 21,523 మంది హాజరయ్యారని, 1597 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలపకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.
తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారకాతిరుమల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏలూరులో కలెక్టర్‌ను ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురానికి చెందిన చిట్టెమ్మ కలిసి తన బాధను తెలిపి, న్యాయం చేయాలని కోరింది. తన కుమారుడు నిరాదరణకు గురిచేస్తున్నాడని, ఎటువంటి ఆధారం లేదని, న్యాయం చేయాలని కోరింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో యువకుడికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా కోర్టు కమ్ మహిళా కోర్టు జడ్జి జి.రాజేశ్వరి తీర్పునిచ్చారు. వారి వివరాల ప్రకారం.. 2019లో నరేష్ అనే యువకుడు పాలకొల్లుకు చెందిన యువతని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం నిరూపితం కావడంతో నరేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల ఫైన్ విధించారు.
ఏలూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
1952లో నియోజకవర్గంగా ఏర్పడిన ఉండి TDPకి కంచుకోట. ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగగా 8సార్లు పాగా వేసింది. అందులో 1983-1999 వరకు TDP అభ్యర్థి K.రామరాజు వరుసగా 5సార్లు విజయం సాధించారు. అయితే ఇక్కడ గెలిచిన MLAలలో 8మంది పేర్లు ‘రాజు’లే కావడం గమనార్హం. 1970లో జరిగిన ఒక్కఎన్నికలోనే మహిళ అభ్యర్థి K.ఆండాళమ్మ ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈ సారి TDP నుంచి మంతెన రామరాజు, YCP నుంచి PVL నరసింహరాజు బరిలో ఉన్నారు.
కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆగిరిపల్లి మండలంలో జరిగింది. SI సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమ్మూరుకు చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 7వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు SI తెలిపారు.
ఏలూరు జిల్లాలో ఓటర్లు ఇలా.. మొత్తం ఓటర్లు- 16,25,655 పురుషులు- 7,93,829, స్త్రీలు- 8,31,701 థర్డ్ జెండర్స్- 125, సర్వీస్ ఓటర్లు- 686 పోలింగ్ స్టేషన్లు 1,743 ప.గో జిల్లాలో ఇలా..మొత్తం ఓటర్లు – 14,61,337 పురుషులు- 7,16,955, స్త్రీలు 7,44,308 థర్డ్ జెండర్స్- 74, పోలింగ్ స్టేషన్లు- 1,463 ఉన్నాయి.
ఏలూరు జిల్లాలో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. వివరాలు.. ఏలూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నూజివీడుకు చెందిన పురమా సాయిబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది.
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచి అమలులోకి వచ్చిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు 32 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నందు 1,971 కేసులను రాజీ చేశామన్నారు. అందులో 1,760 పెండింగ్ కేసులకు పరిష్కారం చూపామని చెప్పారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 2,356 పెట్టీ కేసులను కూడా రాజీ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.