WestGodavari

News March 17, 2024

నేడు పోలీస్ యాక్ట్ 30 అమలు: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల పరిధిలో ఏవైనా సమస్యలు ఎదురైతే 100 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. 94409 04808 కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

News March 16, 2024

ప.గో జిల్లా పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు

image

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలలో భరోసా కల్పించేందుకు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా పోలీసులు పాల్గొన్నారు.

News March 16, 2024

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కొడుకు

image

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని తణుకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తనయుడు కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది.

News March 16, 2024

ప.గో: సామాజిక వర్గాల వారీగా వైసీపీ అభ్యర్థులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి 9 మంది, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికలో బరిలో నిలుస్తున్నారు.

News March 16, 2024

ఏలూరు: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.