WestGodavari

News March 24, 2024

కోడలిని తమకు అప్పగించాలని ఎస్పీకి అత్త ఫిర్యాదు

image

తమ కోడలిని తమకు అప్పగించాలని ఓ అత్త ఏలూరు SPకి ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన సురేష్ Febలో లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి పేరెంట్స్‌కి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఓ న్యాయవాది వద్ద కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈనెల 22న ఆ న్యాయవాది ఇంటి నుంచి యువతిని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని, దాంతో సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

News March 24, 2024

ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

image

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్‌ను విధుల నుండి తొలగించామని తెలిపారు.

News March 23, 2024

ఏలూరు: రూ.2.59 ల‌క్ష‌లు సీజ్

image

సార్వత్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.59 ల‌క్ష‌లు సీజ్ చేసిన‌ట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నిక‌ల అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్ కె.ఖాజావలి వెల్ల‌డించారు.

News March 23, 2024

ప.గో.: లెక్క తేలింది.. 6 చోట్ల జనసేన.. 9 చోట్ల టీడీపీ

image

ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. పోలవరం టికెట్‌పై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు కేటాయించగా.. కొద్ది రోజులుగా ఉన్న సందిగ్ధత వీడింది. పొత్తులో భాగంగా 6 స్థానాల్లో జనసేన, 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి కూటమి అభ్యర్థులు ఎన్నింట విజయం సాధించేనో చూడాలి మరి.

News March 23, 2024

ప.గో.: REWIND: కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన ఇండిపెండెంట్

image

భీమవరం నియోజకవర్గానికి 1955, 1962లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాచు వెంకట్రామయ్య కాంగ్రెస్ తరఫున వరుస విజయాలు సాధించారు. 1967లో సైతం కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా బి.విజయ్ కుమార్ రాజు పోటీలో నిలిచి 9207 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో వెంకట్రామయ్య హ్యాట్రిక్ విజయానికి అడ్డుపడింది. 1972 నాటికి విజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరి మరోసారి విజయం సాధించారు.

News March 23, 2024

నేను గెలవగానే కేసులు ఎత్తివేయిస్తా: పులపర్తి

image

వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్లే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ గెలిచినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండా ఎగిరింది. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి 2సార్లు MLAగా గెలిచారు. మిగతా అన్నిచోట్ల వైసీపీ ఒకసారే గెలిచింది. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. పాలకొల్లు, ఉండి స్థానాలనూ వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. కొవ్వూరు, 2012(ఉప), 2019 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గోలోని 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటి వరకు వైసీపీ MLAలు గెలవలేదు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. ఇక కొవ్వూరులో 2012, 19 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012, 19లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ పథక రచన చేస్తున్నాయి.

News March 23, 2024

ప.గో: ‘పది’ పరీక్షలకు 96 శాతం హాజరు

image

ప.గో జిల్లా వ్యాప్తంగా 127 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఆర్‌.వెంకటరమణ తెలిపారు. 21,527 మంది విద్యార్థులకు 20,734 మంది హాజరయ్యారన్నారు. ఎస్‌ఎస్‌సీ (ఏపీఓఎస్‌ఎస్‌) పరీక్షకు 830 మందికి 729 మంది.. ఇంటర్ (ఏపీఓఎస్‌ఎస్‌) పరీక్షకు 810 మందికి 738 మంది హాజరయ్యారని తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని అన్నారు.