WestGodavari

News March 23, 2024

ఉండి మాజీ ఎమ్మెల్యే శివపై కేసు నమోదు

image

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. పాలకోడేరు ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 20న పాలకోడేరు మండలంలో శివరామరాజు సుమారు 30 వాహనాలతో ఊరేగింపు నిర్వహించారని, అందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎస్సై తెలిపారు. దీనిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన సమాచారం మేరకు పాలకోడేరు తహశీల్దార్‌ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

ఏలూరు చరిత్రలో మహిళ MLA లేరు

image

ఏలూరు నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు గెలిచిన MLAలలో ఒక్కరు కూడా మహిళలు లేరు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‘ఐ’ తరఫున మాగంటి వరలక్ష్మి బరిలో ఉన్నప్పటికీ ఆమెపై టీడీపీ అభ్యర్థి మరడాని రంగారావు 9247 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి పురుషులే బరిలో ఉన్నారు.

News March 22, 2024

ప.గో.: ఇక్కడ ఇప్పటివరకు హ్యట్రిక్ నమోదు కాలేదు

image

ప.గో. జిల్లాలోని పాలకొల్లులో 1955 నుంచి 2019 వరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడూ హ్యాట్రిక్ విజయం నమోదుచేయలేదు. అయితే 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నిమ్మల రామానాయుడు వరుస విజయాలు సాధించారు. తాజాగా మరోసారి ఆయన అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి గెలిస్తే పాలకొల్లు చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు ఆయన సొంతమవుతుంది. మరి విజయం సాధించేనా..?

News March 22, 2024

ప.గో.: 24 ఓట్ల మెజారిటీతో MLAగా గెలుపు

image

పోలవరంలో 1999 అసెంబ్లీ ఎన్నికలు ఓ రికార్డు సొంతం చేసుకున్నాయి. అప్పుడు TDPనుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాస రావు కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై కేవలం 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలవరం చరిత్రలో ఇదే అత్యల్ప మెజారిటీ. 2019లో YCP నుంచి బరిలో నిలిచిన తెల్లం బాలరాజు ఎన్నడూ లేనంతంగా 42070 అత్యధిక మెజారిటీ సాధించగా ప్రస్తుతం ఆయన సతీమణి బరిలో ఉన్నారు. TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థి తేలాల్సి ఉంది.

News March 22, 2024

పాలకొల్లులో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌అరెస్ట్

image

అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన 20 మంది దళిత యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే క్రమంలో శుక్రవారం పాలకొల్లులోని ఆయన ఇంటికి యలమంచిలి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వెళ్లి హౌస్ అరెస్టు చేశారు.

News March 22, 2024

ఉమ్మడి ప.గో నేతల్లో టెన్షన్.. ఆ ‘ఒక్కరు’ ఎవరు..?

image

TDP అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలోనూ పోలవరం టికెట్‌పై సందిగ్ధత వీడలేదు. ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున సైతం పోలవరం మినహా.. 14 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, పోలవరం నుంచి మాత్రం ఏ పార్టీ బరిలో ఉంటుంది..? ఎవరు పోటీ చేస్తారు..? అనే ఉత్కంఠ వీడటం లేదు. దీంతో అటు క్యాడర్‌లో టెన్షన్.. ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

News March 22, 2024

ఏలూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థినికి వేధింపులు!

image

ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరిట వేధిస్తున్న ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై ప్రియ కుమార్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన బాలిక(17) మచిలీపట్నంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలిక సొంతూరుకు చెందిన యువకుడు ప్రేమించాలంటూ కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

అనుమతులు తప్పనిసరి: ఏలూరు ఎస్పీ

image

ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీ అమలులో ఉన్నందున ఏవైనా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సువిధ యాప్‌లో పూర్తి సమాచారంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతించమని తెలిపారు.

News March 22, 2024

పోలవరం: చివరికి ఆ సీటు ఎవరికి..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే సీటు కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొంది. కొంతకాలం వరకు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ ఇస్తున్నారని, అలాగే టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసులకు సీటు కేటాయిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలలో కొత్త అభ్యర్థుల పేర్లు వినిపించడంతో టీడీపీ, జనసేన నాయకుల్లో టెన్షన్ నెలకొంది.

News March 21, 2024

ఉంగుటూరు: ఒకే వేదికపై ఎమ్మెల్యే అభ్యర్థులు

image

ఉంగుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత అభ్యర్థి పుప్పాల వాసుబాబు, జనసేన- టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఒకే వేదికపై కనిపించారు. నిడమర్రు మండలం
పెదనిండ్రకొలను రథోత్సవంలో వీరిద్దరూ వాహనంపై ఎక్కి పూజలు నిర్వహించారు. వారితో పాటే మాజీ MLA గన్ని వీరాంజనేయులు కూడా ఉన్నారు. ముగ్గురు నాయకులు పరస్పరం అభివందనం చేసుకుని భక్తి కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత చోటుచేసుకుంది.