India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమవరం పట్టణంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కేరళకు చెందిన రికేశ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణానికి చెందిన పేరుచర్ల కృష్ణంరాజు 152 రకాల స్వీట్లు, పచ్చళ్ళు, బిరియానీలు, ఫ్రూట్స్‌తో విందు ఏర్పాటుచేశారు. దీంతో శర్మ వంటకాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం సాయంత్రం భారీ వర్షాలు కురవగా, ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. ప్రధానంగా పెంటపాడు, తాడేపల్లిగూడెం పోడూరు, ఆచంట, పెనుగొండ తదితర ప్రాంతాలలో ఎండ ధాటికి రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?
సీఎం చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంట్‌లోని కూటమి పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలవరంలో ప్రాజెక్ట్‌ని సందర్శిస్తారని అన్నారు.
పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలలో భద్రతా పరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వీవీఐపీ భద్రత కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.
గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ గోదావరి జిల్లాలో 3.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో యలమంచిలి మండలంలో 2.0 మిల్లీమీటర్లు, పాలకొల్లు మండలంలో 1.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని వివరించారు. సరాసరి జిల్లా వర్షపాతం 0.2 మిల్లీమీటర్లు నమోదయింది.
తనకు దక్కిన జలవనరుల శాఖతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కలిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన జలవనరుల శాఖకు తిరిగి జవసత్వాలు తెస్తామని, పోలవరం పూర్తికి తొలి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ప్రాజెక్ట్‌లో 40శాతం నిధులను ‘జే’ గ్యాంగ్ కమీషన్ల రూపంలో దోచుకుందని, ప్రాజెక్టుల పేరిట వారు చేసిన అక్రమాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.
భీమవరం మండలం వెంపకు చెందిన లక్ష్మీదుర్గ(33) శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు పాశర్లపూడికి చెందిన CISF కానిస్టేబుల్ దుర్గామహేశ్‌తో 2014లో పెళ్లి జరిగింది. లక్ష్మీదుర్గ కాలేజ్‌లో ల్యాబ్ అసిస్టెంట్. ఇద్దరు పిల్లలు. విభేదాల వల్ల దంపతులు దూరంగా ఉంటుండగా.. ఈనెల 13న తండ్రి ఆమెను అత్తవారింట్లో అప్పగించి వచ్చారు. చెన్నైలో ఉంటున్న భర్త వద్దకు వెళ్లడం ఇష్టంలేక లక్ష్మీదుర్గ ఉరేసుకొని మృతి చెందింది.
సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత CMగా ఆయన సందర్శించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 9.30 గంటలకే ఆయన పోలవరం చేరుకొని అంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడే ప్రాజెక్ట్, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా పోలవరం MLAగా చిర్రి బాలరాజు విజయం సాధించిన నేపథ్యంలో ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు శనివారం కాలినడక బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి గెలిస్తే పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు. నరసింహమూర్తి, శ్రీను, ప్రసాద్, కృష్ణ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.