WestGodavari

News July 8, 2024

ఏలూరు: UPDATE.. మృతులు HYDవాసులు

image

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి పరిధిలోని రాజవోలు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. కారు డ్రైవర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన దుర్గా వంశీగా గుర్తించారు.

News July 8, 2024

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, బాలుడికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా లక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

ఏలూరు: 3ఏళ్లుగా పరారీలో.. ఎట్టకేలకు చిక్కాడు

image

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పరారీలో ఉన్న గోడే పశుపతి రమణను 3 సంవత్సరాల తర్వాత పట్టుకున్నట్లు ఎస్సై రాజారెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. 3 సంవత్సరాల కింద గంజాయి రవాణా కేసులో కారు, 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న రమణను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

News July 7, 2024

ఏలూరు: 30 రోజులుగా నిరసన

image

ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి ఫ్యాక్టరీ వద్ద సీపీఎఫ్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరసన ఆదివారంతో 30వ రోజుకు చేరుకుంది. మూసిన ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని, సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. నెల రోజులుగా ధర్నా చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని అన్నారు.

News July 7, 2024

భీమవరంలో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం 

image

భీమవరం గునుపూడిలోని బాలికల హాస్టల్‌లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RRDS ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అమూల్యరావు మాట్లాడుతూ.. చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్ట పడతారని అన్నారు. చాక్లెట్ రుచుల్లో మొత్తం 600 రకాలున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.
☛ ఇంతకీ మీకు ఏ చాక్లెట్ ఇష్టం..?

News July 7, 2024

ప.గో.: అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు

image

ప.గో. జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పాలకొల్లులో శనివారం నిర్వహించిన సమీక్షలో అధికారులతో ఆయన చర్చించారు. డ్రెయిన్లకు సంబంధించి 35, పంట కాల్వలకు సంబంధించి 55 పనులను చేయడానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినందున తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

News July 7, 2024

ప.గో.: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని.. సూసైడ్

image

నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.

News July 7, 2024

ఏలూరు: డిప్యూటీ తహశీల్దార్‌పై కత్తితో దాడి

image

ఏలూరు అమీనాపేట ప్రాంతంలో రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరు మండల డిప్యూటీ తహశీల్దార్‌ లామ్‌ విద్యాసాగర్‌పై నగరానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శనివారం ఇంటి నుంచి కార్యాలయానికి బైక్‌పై వెళ్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన సదరు వ్యక్తి తహశీల్దార్‌ను అడ్డుకొని దాడి చేసినట్లు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 7, 2024

ప.గో.: DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప.గో. జిల్లాలోని DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సి.నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలంతా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు జీవనోపాధి మార్గాలను ఎంచుకొనేలా చొరవ చూపాలన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సహాయం తీసుకొని రానున్న రెండు నెలలల్లో బలోపేతం చేయాలని ఆదేశించారు.

News July 6, 2024

ఏలూరు జిల్లాలో హార్ట్ ఎటాక్‌తో VRA మృతి

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి VRA పసుపులేటి మోహన్‌రావు శుక్రవారం అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోహన్‌రావు సేవలు మరువలేనివని అన్నారు.