India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లజర్ల జాతీయ రహదారిలో ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే TPG ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ తెలిపారు. 2019-2024లో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన 18-25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ కోసం రేబిస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని కోరారు. రేబిస్ లక్షణాలున్న పెంపుడు జంతువు కరిస్తేనే కాకుండా వాటి చొంగ వల్ల కూడా రేబిస్ సోకుతుంది.
పాలకొల్లులోని లంకలకోడేరు సచివాలయం-2లో గ్రేడ్-5 సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న బి.రాము ఈ నెల ఒకటో తేదీన పింఛన్ సొమ్ము రూ.2.50 లక్షలతో పరారైన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సెల్ సిగ్నల్ ద్వారా HYDలో రామును పట్టుకుని అధికారుల ముందు శుక్రవారం హాజరుపర్చారు. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా గతంలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. విచారణలో సీఐ సతీష్, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులు, కొండవాగులు పొంగి వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం నాటికి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఎగువన 26.470 మీటర్లు, స్పిల్వే దిగువన 16.350 మీటర్లు, ఎగువ కాపర్ డ్యామ్ ఎగువన 26.530 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ దిగువన 15.330 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.
నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.
మాజీ సీఎం జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో పడ్డాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం సీఈ, ఎస్ఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో జలవనరుల శాఖ 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చెప్పారు. వర్షాకాలానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?
EVM బద్దలు కొట్టడం తప్పు కాదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం దారుణమని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమేనని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ధ్వంసంపై, జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేలా ఈసీ సుమోటోగా కేసును టేకప్ చేయాలని కోరారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కడగట్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి మమత ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మమత స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. యువతి స్వగ్రామం నిడదవోలు. ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సుధాకర్ పరిశీలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బిర్లా భవన్ సెంటర్‌లో ఉన్న ఓ మెడికల్ షాప్ దగ్ధం అయింది. ఈ ఘటనలో షాపులోని మందులన్నీ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా..? మరేదైనా కారణమా..? తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.