India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మెరిపో కిషోర్(33) గురువారం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్.. రోడ్డు కం రైలు వంతెనపై మోటారు సైకిల్, చెప్పులు విడిచిపెట్టి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి మృతదేహం లభ్యమైంది.
ప.గో. జిల్లా పోడూరు మండలం గుమ్ములూరు గ్రామానికి చెందిన షేక్ బాషా, కుమారుడు వలీ ఉపాధి నిమిత్తం ఖత్తర్ దేశం వెళ్లారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి వారు నివసిస్తున్న గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో షేక్ బాషా (46) మృతి మృతి చెందగా కుమారుడు వలీ చేతులు కాలిపోగా అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాడేపల్లిగూడెంలోని పురుగు మందుల పరీక్ష ల్యాబ్‌కు కావలసిన మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప.గో. జిల్లా JC ప్రవీణ్ ఆదిత్య అన్నారు. కలెక్టరెట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల బిడ్డర్లు ఈఎండీ మొత్తం రూ.2 లక్షల నగదును జూలై 16 మధ్యాహ్నం 12 గంటలలోపు డీడీ లేదా బ్యాంక్ చెక్ రూపంలో కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం దొండపూడిలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని ఊట్లగూడేనికి చెందిన సురేశ్(27), స్నేహితుడు రాంప్రసాద్‌తో కలిసి బైక్‌పై గోపాలపురం వెళ్తున్నారు. దొండపూడి వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఇద్దరికీ గాయాలవగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేశ్ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు SI సతీశ్ చెప్పారు.
పెదపాడు మండలం కొక్కిరపాడు సాయిబాబా గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 16 నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామానికి చెందిన గుళ్లంకి ఉమ(26) గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని తమిరిసి వెంకటేశ్వరరావు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో మదర్ థెరిసా విగ్రహం ఎదుట వెంకటేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నల్లజర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో 200 మీటర్ల నుంచి రక్తపు మరకలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు.
విజయవాడ జోన్ పరిధిలోని రైల్వే లైన్ల నిర్వహణ పనుల్లో భాగంగా వచ్చే నెల ఆగష్టున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు నరసాపురం – విజయవాడ, ఆగస్టు 5 నుంచి 12 వరకు విజయవాడ -నరసాపురం, ఆగస్టు 4 నుంచి 10 వరకు నరసాపురం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తు న్నట్లు చెప్పారు.
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఛైర్మన్ & సీఈఓ జయ వర్మ సిన్హాను బుధవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కలిశారు. న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో వందేభారత్ రైళ్లకు ఏలూరులో హాల్ట్ కోరుతూ వినతిపత్రం అందించారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్‌ను పనులు వేగవంతం చేయాల్సిందిగా కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించిట్లు తెలిపారు.
ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన వెంకట రమణమూర్తి 29వ తేదీన ప్రమాదానికి గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ ఆయనకు అందలేదు. వాట్సాప్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఈ రోజు ఆయనకు పింఛను అందజేశారు. కలెక్టర్‌కి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.
కుమార్తెను చూసేందుకు వెళ్తూ రైలులోంచి జారి పడి తల్లి మృతి చెందిన ఘటన ఏలూరులో జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వేలేరుపాడు మండలం కోయమాదారం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(60) కుమార్తె నెల్లూరులో ఉంటోంది. బుధవారం ఆమెను చూసేందుకు వెళ్తూ ఏలూరు రైల్వే స్టేషన్‌లో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ జారి పడి మృతి చెందింది. దీనిపై రైల్వే ఎస్ఐ డి.నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.