India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా పోలవరంలో మరోసారి చిరుత కలకలం రేపింది. అటవీ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలుగండికి చెందిన మడకం పుల్లారావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికారు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి చేసి చంపినట్లు అధికారులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల కింద కూడా ఇదే మండలంలో చిరుత మేకను చంపేసిన విషయం తెలిసిందే.
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడి ఆచూకీ రెండేళ్ల తర్వాత తెలిసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్లగూడెంకు చెందిన మహాలక్ష్మి కుమారుడు నందకిశోర్ చదవడం ఇష్టంలేక 2022లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ అలానే వెళ్లి తిరిగి వచ్చేసేవాడు. కానీ.. రెండేళ్ల కింద వెళ్లిన నందకిశోర్ తిరిగి రాలేదు. అతడు కోల్‌కతాలో ఉన్నట్లు 4 రోజుల కింద తెలియగా.. తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం విద్యాశాఖ అధికారి ఎన్. అబ్రహం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దరఖాస్తు చేసుకోవడానికి http://natioonlawardstoteachers.education.gov.in వెబ్సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. జూలై 15 వరకు అవకాశం ఉందని తెలిపారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిడదవోలు నుంచి వేండ్ర వరకు టికెట్ తీసుకున్న సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కాల్దరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉండ్రాజవరం మండలం వేలివెన్ను కొత్తపేటకు చెందిన సిర్రా లక్ష్మణరావు 2020 మార్చిలో చర్చిలో ఉన్న వివాహితను పిలిపించి.. అసభ్యకరంగా తిట్టి, కొట్టి.. ఉరేసుకుని చనిపోతే మంచిదని దూషించాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఉరి వేసుకుంది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.మంగళవారం తుది విచారణ అనంతరం నాలుగేళ్లు జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. గతేడాది మార్చిలో కనీసం ఖర్చులు రాని పరిస్థితి నుంచి ప్రస్తుతం లాభాలను స్వీకరించే స్థాయికి రైతులు చేరుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. అందులో 1.40 లక్షల ఎకరాల్లో తెల్ల చేపలు, 30 వేల ఎకరాల్లో ఫంగస్ రకానికి చెందిన చేపలు, లక్ష ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు.
పెద అవుటుపల్లి-గన్నవరం మధ్య ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా నేటి నుంచి నడిచే పలు రైళ్లను నిడదవోలు-గుడివాడ- విజయవాడ మార్గంలో నడుపుతున్నట్లు ద.మ. రైల్వే విజయవాడ డివిజన్ పిఆర్ నుస్రత్ మంద్రుపాకర్ తెలిపారు. విశాఖపట్నం-కొల్లాం మధ్య నడిచే నిడదవోలు- గుడివాడ- విజయవాడ రైలు మార్గంలో నడపనున్నట్లు తెలిపారు. ధన్బాద్-తాంబరం ఎక్స్ప్రెస్, బరోని-మంగుళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్ నిడదవోలు- విజయవాడ మార్గంలో నడుస్తాయన్నారు.
ఏలూరు జిల్లా: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, MLa చిర్రి బాలరాజు, ఉంగుటూరు MLA ధర్మరాజు, ఐటీడీఏ పీఓ ఏం. సూర్యతేజ తదితరులు ఉన్నారు.
కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే ఈ కారులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సందడి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన కల్కి చిత్రం ఘనవిజయం సాధించడంతో మూవీ టీంకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ కొత్త స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.అబ్రహం తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి apopenchool.ap.gov.in వెబ్సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఇప్పటికే పర్మిషన్ పొంది ఉన్న స్టడీ సెంటర్లలోనూ రెన్యువల్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.