WestGodavari

News July 2, 2024

ఏలూరు: ఆసుపత్రి పైనుంచి పడి రోగి మృతి

image

ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వేమూరి సత్యనారాయణ(40) అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. సత్యనారాయణ ఆసుపత్రి భవనంపై నుంచి కింద పడి ఉండటాన్ని అక్కడి వారు మంగళవారం గుర్తించారు. వెంటనే మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనలో నిపుణుల బృందం

image

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడవ రోజు పర్యటించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకొని ముందుగా ECRF (Gap-2)లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించారు. మ్యాప్ పాయింటింగ్ ద్వారా సంబంధిత ఇరిగేషన్ అధికారులు సేకరించిన నమూనాల నాణ్యతను బృందానికి అధికారులు వివరించారు.

News July 2, 2024

ప.గో.: డ్యూటీకి రాని కార్యదర్శి.. ఆగిన పింఛన్

image

ప.గో. జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పింఛన్ సొమ్ము రూ.2,50,500 డ్రా చేసిన పంచాయతీ సెకండ్ కార్యదర్శి రాము సోమవారం విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో పింఛన్ పంపిణీ ఆగిపోయింది. ఈ మేరకు మరో పంచాయతీ కార్యదర్శి రాజేశ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.

News July 2, 2024

పోలవరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. సోమవారం ఉదయానికి స్పిల్‌వే ఎగువన 25.700 మీటర్లు, దిగువన 15.700 మీటర్లు, కాపర్‌ డ్యాంనకు ఎగువన 25.750 మీటర్లు, దిగువన 14.400 మీటర్ల నీటి మట్టం నమోదైంది. అదనంగా వచ్చిన 29,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఈఈ వెంకటరమణ తెలిపారు.

News July 2, 2024

నేడు భీమవరంలో ‘ కల్కి’ మూవీ బుజ్జి కారు

image

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరో ప్రభాస్ నడిపిన బుజ్జి కారును భీమవరం మల్టీప్లెక్స్ ఆవరణలో మంగళవారం ప్రదర్శించనున్నట్లు థియేటర్ యాజమాన్యం సోమవారం రాత్రి తెలిపింది. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఈ బుజ్జి కారు ఉంటుందని తెలిపారు.

News July 2, 2024

ప.గో జిల్లాలో 95.42% పెన్షన్ల పంపిణీ

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. మొత్తం జిల్లాలో పెన్షన్‌దారులు 2,32,885 మందికి గాను 2,22,221 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News July 2, 2024

ఏలూరు జిల్లాలో 95.42% పెన్షన్ల పంపిణీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. జిల్లాలోని మొత్తం పెన్షన్‌దారులు 2,68,353 మందికి గానూ 2,56,331 మందికి అందజేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

News July 1, 2024

ప.గో: యువకుడి మిస్సింగ్.. గోదావరిలో గాలింపు

image

ఫంక్షన్‌కని చెప్పి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ప.గో జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లికి చెందిన వై.త్రిమూర్తులు పంక్షన్‌కు వెళ్తున్నానన చెప్పి ఆదివారం ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడం.. బైక్ నరసాపురంలోని స్మశానవాటిక దగ్గరలో ఉండటంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాలర్లతో పడవ సాయంతో గోదావరిలో వెతికించారు.

News July 1, 2024

ప.గో: కాపు కాసి యువకుడిపై దాడి.. రంగంలోకి DSP

image

తణుకు మండలం కొమరవరంలో ఇటీవల యువకుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన ఘటనపై తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి సోమవారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేడే రాంమూర్తి బైక్‌పై వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, సాయిలు గత నెల 26న దారి కాచి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తణుకు రూరల్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News July 1, 2024

ఏలూరు: ఆసుపత్రికి వెళ్లి మరీ పెన్షన్ అందజేత

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన కొవ్వలి రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది అడారి చందు, శివ శంకర్, కూటమి నేతలు తొలి రోజున ఎలాగైనా రాజుకు నగదు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో ఏలూరులోని ఆసుపత్రికి వెళ్లి మరీ పెంచిన పెన్షన్ అందించారు. ఆయన ఆనందం వ్యక్తం చేశారు.