India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజవర్గ సమస్యలను కలెక్టర్ నాగరాణికి వివరించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పని చేస్తున్న చిర్రావూరి రత్న గిరి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆరోపించారు. 2014కు ముందు ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రమే జరగ్గా.. 2014- 2019 మధ్య టీడీపీ హయాంలో 68 శాతం పనులు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులను మాత్రమే చేయగలిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును సందర్శించి.. పనులను గాడిలో పెడుతుందని చెప్పారు.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. భీమవరం రూరల్ స్టేషన్ రైటర్ మహేశ్ తెలిపిన వివరాలు.. భీమవరం మండలం యమునేపల్లికి చెందిన బుంగా చందు(23) ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో పెళ్లి కుదరడంతో మనస్తాపంతో చందు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాతపాడు వద్ద ఉప్పుటేరులో ఆదివారం మృతదేహం లభ్యమైంది. సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో చింతలపూడిలో బుధవారం జంగారెడ్డిగూడెంలో, గురువారం కామవరపుకోటలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. శుక్రవారం అధికారులతో నియోజకవర్గంపై సమీక్ష చేస్తానని చెప్పారు. ఇక శనివారం 4 మండలాల్లోని ప్రభుత్వకార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్తికేయ మిశ్రా గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో రైతులకు బకాయిపడిన ధాన్యం విక్రయాల డబ్బులను త్వరలో చెల్లిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆదివారం ఆయన నిడదవోలులో మీడియాతో మాట్లాడుతూ..గతంలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం విక్రయాల నగదును చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. జూలై 1న లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లుచేశామన్నారు.
Sorry, no posts matched your criteria.