India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉండి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే RRR ఏర్పాటుచేసిన ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి’ నిధికి ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ.5 లక్షల నగదును ఆదివారం విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన్ను ఎమ్మెల్యే సత్కరించారు.
కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ వద్దకు కొద్దిసేపటి కింద అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ డ్యాములను నిపుణులు పరిశీలించారు. 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్‌లో 1,530 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. వాటిలో 154 సివిల్ కేసులు, 129 వాహన ప్రమాద బీమా కేసులు, 1,247 క్రిమినల్ కేసులు, 102 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
తన పేరు చెప్పి ఓ వ్యక్తి మాయమాటలతో రాజకీయ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ MP చేగొండి హరిరామజోగయ్య DGP ద్వారకా తిరుమలరావుకు శనివారం లేఖ రాశారు. నిందితుడి మాటలు నమ్మి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులు అతడికి డబ్బులు ఇస్తున్నారని, 6 నెలలు కిందట దీనిపై పాలకొల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. యువత కేరింతలతో హోరెత్తించారు. జంగారెడ్డిగూడెంలో అర్ధరాత్రి యువత బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మంత్రి నారా లోకేష్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.
గత రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నగదు బకాయిలు చెల్లించాలని CM చంద్రబాబును నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కోరారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం బకాయిల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. స్పందించిన సీఎం త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగరాణిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూలకుండీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని లాండ్ ఆర్డర్‌పై వివరించారు.
ప్రముఖ సినీనటుడు రావు రమేష్ ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సాయంగా రూ.3 లక్షలు ఆర్థికసహాయం అందించారు. ఈ మేరకు ఉండి MLA కనుమూరి రఘురామ కృష్ణరాజుకు సంబంధిత చెక్కును అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు ఎమ్మెల్యే RRR ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.