India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల అజాగ్రత్త.. అధికారుల నిర్లక్ష్యం.. కారణాలేవైనా ఉమ్మడి ప.గో.లో విద్యుత్ ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఆగిరిపల్లిలో <<13521060>>తల్లీకొడుకు<<>>, తాడేపల్లిగూడెంలో <<13520724>>దంపతులు<<>> మరణించారు. 2022 APR 1 నుంచి దాదాపు 119మంది మృతిచెందారు. 2022-23లో 60 ప్రమాదాలు జరగ్గా 45మంది, 202324లో 58 ఘటనల్లో 49మంది చనిపోయారు. 2024-25లో ఇప్పటికే 49 విద్యుత్ ప్రమాదాలు జరగ్గా.. 25మంది ప్రాణాలొదిలారు.
ప.గో జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నరసాపురంలో అత్యధికంగా 87.0, పాలకొల్లు 72.4, భీమవరం 79.4, ఉండి 68.8 , వీరవాసరం 59.2, పాలకోడేరు 52.2, గణపవరం 46.4, ఆకివీడు 47.4, యలమంచిలి 40.2, కాళ్ల 40.2, పెనుగొండ 38.2, ఆచంట 38.0, పెనుమంట్ర 37.8, పోడూరు 30.4, అత్తిలి 25.2, మొగల్తూరు 24.6, తాడేపల్లిగూడెం 19.4, పెంటపాడు 17.2, ఇరగవరం 16.2, తణుకు 9.4 మిమీ చొప్పున నమోదైంది.
ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని కోర్టులో ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో ప్రామిసరీ నోటు దావాలు, ఆస్తి దావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్‌ఫండ్ సంబంధిత, ఆర్బిటేషన్ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్రరామ్(20) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామ్ భీమవరం నుంచి తుందుర్రు వెళ్తుండగా.. తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై భీమరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులైన పేదలకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్‌తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన దొండపాటి నాగరత్నం (60), ఆమె కొడుకు దొండపాటి రామదాసు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయారు. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ రోజు కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు చనిపోయిన విషయం తెలిసిందే.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కాగా దీనికి ‘కల్కి 2898AD’ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ.5 లక్షల విరాళం అందించినట్లు RRR తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, రైతులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు విదేశీ నిపుణుల బృందం ఈనెల 30న వస్తున్నారని ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 29వ రాత్రికి పోలవరానికి ఈ బృందం చేరుకుని ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేస్తారని, 30 ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రంవాల్ ప్రాంతాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈనెల 27న ఈ బృందం రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల తేదీలు మారినట్టు ఈఈ తెలిపారు.
పోలవరంలో మండలం వింజరం పంచాయతీలో చిరుతపులి మేకను చంపినట్లు అధికారులు గుర్తించారు. కోటేశ్వరరావు మేకలు మేపుకునే వాడు.అయితే అందులో ఒకటి కనిపించడం లేదని అడవిలో గాలిస్తుండగా బుధవారం కళేబరం కనిపించింది.సమాచారం అందుకున్న అధికారులు పోలవరం పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని , జీవాలను బయటకు వదలొద్దని ఇన్‌ఛార్జ్ రేంజర్ ఎం.దావీద్ రాజ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.