India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గంటా ప్రభాకర్ (61)విధి నిర్వహణలో గుండెపోటుకు గురై మృతి చెందారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో గుండె పోటు రాగా హుటాహుటిన పాలకొల్లు న్యూలైఫ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య సేవలందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్, వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తపాలా బ్యాలెట్ ఓట్ల సాధనలో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు అత్యధికంగా 1,723 తపాలా ఓట్లు వచ్చాయి. పాలకొల్లు 1,643, తణుకు 1,593, తాడేపల్లిగూడెం 1,488, నరసాపురం 1,075, ఉండి 960, ఆచంట 973, నిడదవోలు1,090, కొవ్వూరు 1,023, గోపాలపురం 744 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నూతనంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.
ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి నలుగురు పోటీచేయగా అందరూ ఓడిపోయారు.
☛ అసెంబ్లీ స్థానం
✦ పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
✦ గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఓడిపోయారు.
☛ పార్లమెంట్
✦ ఏలూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.లావణ్య 20826ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు.
✦నరసాపురంలో వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల 4,30,541 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది.
ఉమ్మడి ప.గో. జిల్లా ఆచంట మాజీ MLA పితాని సత్యనారాయణ ప్రస్తుత విజయంతో 4వ సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే తాజా విజయంతో వరుసగా 3 సార్లు గెలిచిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈసారి హ్యాట్రిక్ సాధించారు. తరువాతి వరుసలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు 3వ సారి అసెంబ్లీకి వెళ్తున్నారు.
ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గెలుపొందిన కూటమి MLAలలో ఒక్క పోలవరం మినహాయిస్తే.. అన్నీ చోట్ల 25 వేలకు పైగా మెజారిటీలు సాధించారు. మరోవైపు ఆరుగురు MLAలు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరి ఇంత భారీ మెజారిటీలకు కారణం టీడీపీ- జనసేన- బీజేపీ జత కట్టడమే అని లోకల్‌గా టాక్ నడుస్తోంది.
– మీరేమంటారు..?
పోలవరం ఓట్ల లెక్కింపులో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. తొలిరౌండ్లో ఆధిక్యం కనబర్చిన వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి తిరిగి 4వ రౌండులో ఆధిక్యం అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత రౌండ్లలో జనసేన అభ్యర్థి పోలవరం బాలరాజు జోరందుకోగా 8, 9, 10, 11 రౌండ్లలో తిరిగి వైసీపీ అభ్యర్థి ఆధిక్యతను నిలుపుకొనే ప్రయత్నం చేశారు. 14- 20వ రౌండ్ వరకు బాలరాజు మళ్లీ జోరు చూపి 7935 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.