India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.
ఏలూరు జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జేసీ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టమాటా, ఉల్లి, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పుష్పమణి , జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ ఏడీ రామ్మోహన్ పాల్గొన్నారు.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్ నిపుణుల బృందం రానుంది. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ అంశాలను పరిశీలించనున్నారు.
సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ప.గో జిల్లా వ్యాప్తంగా 1.067 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!
తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన మణికంఠ(16) ఆదివారం ఉదయం పట్టణంలోని యాగర్లపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో పడి గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సోమవారం గాలింపు చర్యలు కొనసాగించారు. గజఈతగాళ్లు, మరబోట్లు సాయంతో కాలువలో గాలించినా ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలు విరమించుకున్నారు. అతని ఆచూకీ ఇంకా దొరకక పోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
జంగారెడ్డిగూడెంలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. పట్టణంలో రాజుల కాలనీలో ఇళ్ల మధ్య వ్యభిచార గృహం నడిపిస్తున్నారనే సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం ఎస్సై జ్యోతి బసు తన సిబ్బందితో దాడి చేశారు. ఇద్దరు విటులు , ఇద్దరు అమ్మాయిలు, ఒక నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.
డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఇటీవల అక్కినేని జీవితం, నట జీవితంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్ సత్తా చాటారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. అక్కినేని సాంఘిక చిత్రాలు అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ బహుమతి లభించినట్లు పేర్కొన్నారు. రాబోయే సెప్టెంబర్‌లో పురస్కారం అందిస్తారని చెప్పారు.
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రూట్‌లో పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి స్టేషన్లకు సుమారు 200 మంది ఉద్యోగులు సీజన్ టికెట్లు తీసుకుని రోజువారీ విధులకు వెళ్లొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగానైనా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఒక ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప.గో. జిల్లావాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో భీమవరం మీదుగా ప్రయాణించనుంది. ప్రస్తుతం చెన్నై- విజయవాడల మధ్య నడుస్తున్న ఈ రైలు భీమవరం వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. చెన్నై సెంట్రల్ రైల్వే సైతం పచ్చజెండా ఊపింది. ఈ రైలు ఏప్రిల్‌లోనే పట్టాలెక్కాల్సి ఉంది. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న ఈ ట్రైన్ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.