WestGodavari

News June 4, 2024

ప.గో.: క్లీన్ స్వీప్.. చరిత్ర సృష్టించిన కూటమి

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. ఉమ్మడి జిల్లాలోని 15 స్థానాల్లో అన్నిచోట్ల విజయ దుందుభి మోగించారు. జనసేన 6 చోట్ల (నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరు, నరసాపురం, పోలవరం) టీడీపీ 9 చోట్ల పోటీచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 చోట్ల గెలుపొందింది.
– SHARE IT

News June 4, 2024

ప.గో.: 13 చోట్ల కూటమి ఘన విజయం.. ఇంకా రెండే

image

నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కందుల దుర్గేశ్ విజయం సాధించారు. మొత్తం 102699 ఓట్లు సాధించగా.. 33304 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రత్యర్థి జి.శ్రీనివాస నాయుడుకు 69395 ఓట్లు వచ్చాయి. ఇక ఈ విజయంతో ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 13 కైవసం చేసుకున్నట్లయింది. ఇంకా పోలవరం, దెందులూరు ఫలితాలు రావాలి.

News June 4, 2024

ప.గో.: రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ..?

image

ప.గో. జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 72121 భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో రాష్ట్రంలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. ఆరిమిల్లికి మొత్తం ఓట్లు 1,29,547 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి బరిలో నిలిచిన కారుమూరి వెంకట నాగేశ్వర రావుకు 57426 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

ప.గో.: 12 మంది కూటమి అభ్యర్థులు గెలుపు

image

ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఘన విజయం సాధించారు. 44,107 ఓట్లతో ప్రత్యర్థి వాసుబాబుపై గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 12 చోట్ల గెలిచినట్లయింది. ఇక పోలవరం, దెందులూరు, నిడదవోలు ఫలితాలు రావల్సి ఉంది.

News June 4, 2024

ప.గో.లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా..? మీ కామెంట్..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 11 చోట్ల ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో ఫలితం రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ 13 చోట్ల వైసీపీ విజయం సాధించగా.. 2 చోట్ల టీడీపీ పాగా వేసింది. మరి ఈ సారి కూటమి మరో 4 చోట్ల గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. పోలవరంలో కొద్దిగా పోటాపోటీ నడుస్తోంది.
– మీ కామెంట్..?

News June 4, 2024

ప.గో.లో క్లీన్‌స్వీప్ దిశగా కూటమి.. 11 మంది WON

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 11 మంది విజయం సాధించారు. మరో నాలుగు స్థానాలు (దెందులూరు, నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు)లో ఫలితం తేలాల్సి ఉంది. వీటిల్లో పోలవరం ఒక చోటనే వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. మిగతా 3 చోట్లా కూటమే ముందంజలో ఉంది.

News June 4, 2024

ప.గో.లో 9 మంది కూటమి అభ్యర్థులు WON

image

ప.గో. జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. జిల్లాలోని 15 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తోంది. ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో విజయ కేతనం ఎగరేయగా.. తాజాగా ఆచంట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ 84429 ఓట్లు సాధించి 26076 మెజారిటీ సాధించారు.

News June 4, 2024

ప.గో.లో 8 మంది కూటమి అభ్యర్థుల విజయం

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎవ్వరూ తగ్గట్లేదు. మొత్తం 15 సీట్లలో ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం స్థానాల్లో పాగా వేశారు. తాజాగా తాడేపల్లి గూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 114955 ఓట్లు సాధించి 61510 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు కైవసం చేసుకున్నారు.

News June 4, 2024

ప.గో.లో ఆరుగురు కూటమి అభ్యర్థుల విజయం

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. మొత్తం 15 సీట్లలో ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు స్థానాల్లో పాగా వేయగా.. నరసాపురంలోనూ జనసేన అభ్యర్థి 49096 భారీ మెజారిటీతో విజయం సాధించారు.

News June 4, 2024

ప.గో.లో ఐదుగురు కూటమి అభ్యర్థుల గెలుపు

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడిలో విజయం సాధించగా.. తాజాగా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71059 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.