WestGodavari

News June 23, 2024

ఏలూరు: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషనర్ కోర్సులో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన వారు, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. చివరి తేదీ 28-06-2024.

News June 22, 2024

ప.గో, ఏలూరు జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే

image

➤ ప.గో కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టెక్నికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్‌గా ఉన్న సి.నాగారాణి కలెక్టర్‌గా రానున్నారు. సుమిత్‌ను చిత్తూరు కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
➤ ఏలూరు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా ఉన్న వెట్రీ సెల్వీ ఏలూరు కలెక్టర్‌గా రానున్నారు.

News June 22, 2024

ప.గో: ఉరివేసుకుని యువకుడి SUICIDE

image

యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన శనివారం తాళ్లపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరన్నస్వామి(26) రాజమండ్రిలోని దివాన్ చెరువు నుంచి వచ్చి తాళ్లపూడిలోని ఓ హోటల్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కారణమేంటో తెలియదు గానీ వీరన్న సూసైడ్ చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు తరలించినట్లు ఎస్సై శ్యామ్ తెలిపారు.

News June 22, 2024

అసెంబ్లీలో CM చంద్రబాబు నోట పోలవరం

image

అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో అనేక పనులు చేపట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సైతం పూర్తిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. కాగా ఉమ్మడి ప.గో. జిల్లా సహా.. రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

News June 22, 2024

పితాని సత్యనారాయణ అనే నేను

image

ఆచంట MLAగా పితాని సత్యనారాయణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ను కలిసి కరచాలనం చేశారు. శుక్రవారం అనివార్య కారణాల వల్ల పితాని అసెంబ్లీకి వెళ్లని విషయం తెలిసిందే.

News June 22, 2024

ఆచంట MLA పితాని ప్రమాణస్వీకారం నేడే

image

అసెంబ్లీలో ఆచంట ఎమ్మెల్యేగా పితాని సత్యనారాయణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా శుక్రవారం ఆయన అనివార్య కారణాలతో అసెంబ్లీకి రాని విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలలో 14 మంది నిన్న ప్రమాణస్వీకారం చేశారు.

News June 22, 2024

ప.గో.: యాక్సిడెంట్.. పరీక్షకు వెళ్తుండగా మహిళ మృతి

image

పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పరిధిలోని చించినాడ కాలువ కల్వర్టు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన గీతావాణి(23) పెనుగొండలో MBA చదువుతోంది. ఈమెకు రెండేళ్ల క్రితమే వివాహం కాగా.. పరీక్షల కోసం వారం క్రితం పుట్టిల్లు మార్టేరులోని శివరావుపేటకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా లారీని ఢీ కొని చనిపోయింది.

News June 22, 2024

విహారయాత్ర విషాద ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని దిగ్భ్రాంతి

image

బాపట్లలో జరిగిన విహారయాత్ర విషాద ఘటనపై ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుగ్గిరాల నుంచి 11 మంది యువకులు రామాపురం బీచ్‌‌కు విహార యాత్రకు వెళ్లగా నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే.

News June 21, 2024

పశ్చిమగోదావరి జిల్లాకు వర్ష సూచన

image

ద్రోణి ప్రభావంతో శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

News June 21, 2024

విషాదం.. బీచ్‌లో ఏలూరు జిల్లా యువకుల గల్లంతు

image

బాపట్ల జిల్లాలో విషాదఘటన చోటు చేసుకుంది. రామాపురం బీచ్‌‌లో నలుగురు యువకులు స్నానానికి సముద్రంలో దిగగా అలల ఉద్ధృతికి వారంతా కొట్టుకుపోయారు. వారిలో తేజ (21), కిశోర్‌(22) మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు సహాయంతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.