India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని మహాత్మాజ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపల్, కన్వీనర్ శైలజ తెలిపారు. మొత్తం 434 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 329 మంది హాజరయ్యారని, 105 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు.
జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై నేతలెవరూ అధైర్యపడొద్దని సూచించినట్లు మాజీ మంత్రి తానేటి వనిత చెప్పారు. గెలుపోటములు సహజమేనని, మన ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేశామని చెప్పినట్లు వివరించారు. వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అని, ప్రజా సమస్యలపై పోరాటానికి నేతలందరూ సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రతిఒక్కరూ పని చేయాలని చెప్పారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గురువారం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ప.గో జిల్లాలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. అదే రైతుబజారులో అయితే రూ.66 ఉంది. ఆయా చోట్ల వర్షాలతో పంట నష్టం జరిగిందని అందుకు ఉత్పత్తి తగ్గి ఉన్న సరకుకి మంచి డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే సేవలు నాణ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బుధవారం భీమవరం కలక్టరేట్‌లో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి, సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లతో క్షేత్రస్థాయిలో వారు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు.
గెలిచినా, ఓడినా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో రూరల్ మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా అబద్ధపు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారన్నారు.
చింతలపూడికి చెందిన మందగుల కనకలింగ వీరబ్రహ్మం తన చేతికళతో టేకుచెక్కపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన ఆయన 2001లో పాత యర్రవర్రపు శేషయ్య స్ఫూర్తితో తలుపులపై దేవుడి బొమ్మలు చెక్కడం, సిమెంట్ దిమ్మెలపై శిల్పాలు చెక్కడంలో ఆరితేరారు. ఈ క్రమంలోనే తాజాగా రామాయణంలోని పాత్రలు, విశిష్ఠతలను 2 అడుగుల మందం గల టేకుచెక్కపై 3 నెలల సమయంలో చెక్కాడు. ఈ కళ అందరినీ ఆకట్టుకుంటోంది.
ప.గో. జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన సర్వేశ్వరరావు తన ఇంటి వద్ద అల్లిన ఫెన్సింగ్ వలలో ఓ తాచుపాము చిక్కుకుంది. ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్ పి.మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కొవ్వూరు నుంచి రాయకుదురుకు వచ్చి వలలో చిక్కిన పామును రక్షించారు. అనంతరం దానికి నీటిని అందించాడు. సంచిలో బంధించి అడవిలో వదిలేశారు.
Sorry, no posts matched your criteria.