India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది. SI నాగబాబు వివరాల ప్రకారం.. అమృతరావు కాలనీకి చెందిన బాలుప్రసాద్(31) ఓ ఖాళీ స్థలాన్ని కొని అప్పులపాలయ్యాడు. అవి తీర్చేందుకు కువైట్ వెళ్తానని భార్యకు చెప్పగా ఆమె ఒప్పుకోలేదు. కోపంతో పుట్టింటికి వెళ్లిపోవడంతో బాలు ప్రసాద్ ఈనెల 24న పురుగు మందు తాగాడు. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28న మృతి చెందాడు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ముఖేష్ కుమార్ మీనా గురువారం భీమవరం రానున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు భీమవరం SRKR ఇంజినీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీలలో కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన తనిఖీ చేస్తారు. సాయంత్రం భీమవరం నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
తనపై దాడి చేస్తారనే భయంతో భీమడోలుకు చెందిన జయరాజు మజ్జిగలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. జయరాజు ఈనెల 27న కొంతమందితో గొడవపడ్డాడు. అయితే వారు తిరిగి తనపై దాడి చేస్తారనే భయంతో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవారం HYDలోని ఆయన స్వగృహంలో ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కాసేపు రాజకీయ అంశాలపై చర్చించారు.
ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో ఒక SI, నలుగురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 60 మందిపై కేసులు పెట్టామని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. CI రమేశ్ ఉన్నారు.
ఏలూరు జిల్లా తాళ్ళపూడిలో మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు SI శ్యాంసుందర్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిడిపి గ్రామానికి చెందిన బండారు శ్రీనివాస్, స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి సురయ్యపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కావడంతో రాజమండ్రి ఆస్పత్రికి తరలించామన్నారు.
జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ మహేష్ రెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏఈ రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో విద్యుత్ అంతరాయం కలిగిందని స్థానికులు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ మద్యం మత్తులో స్పృహ లేకుండా మహిళతో ఉన్నట్లు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అత్తిలి మండలం పరిధిలోని గవర్లపాలెం రైల్వే గేటు వద్ద రాకపోకలు ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం రైల్వే గేటు మూసివేస్తున్నట్లు చెప్పారు. బుధవారం నుంచి 31సాయంత్రం 7 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని కోరారు.
పెంటపాడు మండలం రావిపాడులో <<13329601>>తీవ్ర ఉద్రిక్తత<<>> నెలకొంది. రావిపాడులో జరిగిన అల్లర్లకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య, తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి రంగంలోకి దిగారు. పోలీసులు ఉన్నతాధికారులపై దళిత సంఘాలు రాళ్లు విసిరారు. దాడిలో పెంటపాడు ఎమ్మార్వో , తాడేపల్లిగూడెం ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్ కు గాయాలు అయినట్లు సమాచారం.
చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.
Sorry, no posts matched your criteria.