India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఏలూరు జిల్లా పోలవరం మండలం ఉడతపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి దాడి చేయడంతో ఐదు మేకలు చనిపోయాయి. ఈ ఘటనపై పోలవరం ఇన్‌ఛార్జి రేంజర్ దావీదు రాజు మాట్లాడుతూ.. గ్రామానికి దూరంగా పొలాల్లో చుండ్రు బుల్లెబ్బాయి మేకల మందను కట్టినట్లు తెలిపారు. నిత్యం అక్కడే మకాం ఉండే అతడు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. చిరుత కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.
పెనుగొండకు చెందిన పలువురు వార్డ్ మెంబర్లు పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారందరికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. వైసీపీ అనే మునిగిపోయే నావ నుంచి ముందే వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆచంట నియోజకవర్గంలో ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తన ధ్యేయమన్నారు.
తణుకు పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు తణుకు బ్రాంచిలో మేనేజర్‌గా పని చేస్తున్న రూపాదేవి శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి బ్యాంక్‌కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి తలకు గాయం కావడంతో తొలుత తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ నాయకులు సొంగ సందీప్ లిడ్ క్యాంప్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి తమవంతు కృషి చేస్తానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ ఛైర్మన్ పదవికి, క్యాబినెట్ హోదాకు వడ్డీ రఘురాం నాయుడు శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీకి అందజేసినట్లు వివరించారు. 2026 మార్చి వరకు తన పదవీకాలం ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తణుకు నియోజకవర్గంలో కూటమికి భారీగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,34,575 ఉండగా.. 1,93,046 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 82.16 శాతం పోలింగ్ నమోదైంది. కాగా TDPకి 66.39 శాతం ఓట్లు రాగా.. వైసీపీ 29.52 శాతానికి పరిమితమైంది. వెరసి ఇక్కడ గెలుపొందిన కూటమి MLA అభ్యర్థి ఆరిమిల్లి మెజారిటీ పరంగా రాష్ట్రంలోనే 6వ స్థానంలో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచారు. 72121 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే.
నూజివీడులో నిన్న <<13390710>>కత్తిపోట్ల<<>> ఘటన కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు..నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయికిరణ్, సుధీర్ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.
లింగపాలెం మండలం వేములపల్లికి చెందిన చట్టిమాల ఆశీర్వాదం(34) JCB డ్రైవర్. భార్య సుమలత పెదవేగి మండలం కొప్పాకకు చెందిన నాగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ప్రియుడితో కలిసి ఉరేసి చంపింది. అతడే ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌లో ప్రియుడితో ఉన్న ఫొటోలు బయటకు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్యచేసినట్లు ఒప్పుకోగా కేసు నమోదైంది.
ఆచంటలోని గంధర్వ మహల్ నిర్మాణానికి అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. నాటి సీఎంలు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆచంట వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు. గంధర్వ మహల్ ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ మహల్‌ను నిర్మించిన గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు మహల్ ముస్తాబవుతోంది.
Sorry, no posts matched your criteria.