India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 3 చోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే తాజా ఎన్నికల్లో తక్కువగా నమోదైంది. 2019లో కొవ్వూరులో 86.46, చింతలపూడిలో 82.09, పోలవరంలో 86.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో చూస్తే కొవ్వూరులో 85.90, చింతలపూడిలో 81.64. పోలవరంలో 85.95 శాతం ఓట్లు పోలయ్యాయి. అన్ని చోట్లా ఒకశాతం పైనే పోలింగ్ తగ్గింది.
– మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?
తణుకు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ఈతకోట అన్నవరం (41) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తణుకు జాతీయరహదారిపై బైక్‌పై వెళ్తుండగా పాత బెల్లంమార్కెట్ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మూడుచోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు తక్కువగా నమోదైంది. 2019లో కొవ్వూరులో 86.46, చింతలపూడిలో 82.09, పోలవరంలో 86.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో చూస్తే కొవ్వూరులో 85.90, చింతలపూడిలో 81.64. పోలవరంలో 85.95 శాతం ఓట్లు పోలయ్యాయి. అన్ని చోట్లా ఒకశాతం పైనే పోలింగ్ తగ్గింది. మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?
ఏలూరు జిల్లాలో జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. జిల్లాలో సభలు, సమావేశాలకు అనుమతులు ఉండవన్నారు. రోడ్లపై ప్రజలు గుంపులుగా తిరగవద్దని హెచ్చరించారు. రోడ్డుపై ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మారణాయుధాలు ప్రదర్శన నిషేధమన్నారు.
ఏలూరు నియోజకవర్గ ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో 67.61 పోలింగ్ నమోదవగా.. ఉమ్మడి ప.గో.లోనే అది అత్యల్పం. కాగా తాజా ఎన్నికల్లో ఆ శాతం స్వల్పంగా పెరిగి 70.17 నమోదైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇదే తక్కువ. మొత్తం 2,35,345 మంది ఓటర్లు ఉండగా.. 85,510 మంది మహిళలు, 79,607 మంది పురుషులు, 15 మంది ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ అభ్యర్థుల విజయంలో మహిళల ఓటింగే కీలకం అవనుంది.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గ ఓటర్లు రికార్డ్ తిరగరాశారు. నియోజకవర్గంలో మొత్తం 2,06,437 మంది ఓటర్లు ఉండగా.. 90,476 మంది పురుషులు, 90,671 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెరసి 87.75 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఉమ్మడి ప.గో.లోనే అత్యధికం. అయితే 2019 ఎన్నికల్లో సైతం ఉంగుటూరు 87.30 శాతం పోలింగ్‌తో ఉమ్మడి జిల్లాలో మొదటిస్థానం పొందింది. తాజాగా రికార్డ్ తిరగరాసింది.
ఉమ్మడి ప.గో.జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి భారతి తెలియజేశారు. 16న బాలురకు సంబంధించి భీమడోలు మండలం పోలసానిపల్లి పాఠశాలలో, 17న బాలికలకు అక్కడే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ప.గో.జిల్లాల్లో గతంతో పోలిస్తే పోలింగ్‌లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.55గా నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో 81.02 శాతం నమోదు కాగా ఈ సారి 82.60 నమోదైంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి.
నరసాపురం- గుంటూరు మధ్య నడిచే గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకూ రద్దు చేశారు. గుంటూరులో ట్రాక్ మరమ్మతు పనులు జరగనున్నందున…. ఈ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. గతేడాది సైతం ట్రాక్ మరమ్మతుల పేరిట కొన్నాళ్లపాటు ఈ రైలు రైల్వే శాఖాధికారులు రద్దు చేశారు. రైలును పూర్తిగా రద్దు చేయకుండా, విజయవాడ లేదా రామవరప్పాడు వరకైనా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఇంకా విజేత ఎవరనేది తెలియాలంటే దాదాపు 20 రోజులు వేచిచూడాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి ప.గో. జిల్లాలో పలు చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ గ్రామంలో చూసినా యువత, పెద్దలు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కాగా మన ఉమ్మడి ప.గో.లో మొత్తం 15 నియోజకవర్గాలున్నాయి. – ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందంటారు.
Sorry, no posts matched your criteria.