India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో విషాదం జరిగింది. మంగళవారం పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తి పరస రామారావుగా గుర్తించారు. పశువులు మేపుతుండగా పిడుగు పడినట్లుగా సమాచారం. మృతుడు RCM పాస్టర్ గా పనిచేస్తున్నాడు. రామారావు మృతితో యడవల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భీమవరంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అంకెం సీతారం బరిలో దిగారు. కాగా.. వైసీపీ నుంచి బరిలో ఉన్న గ్రంధి శ్రీనివాస్, జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. గంధ్రి తొలిసారి(2004) కాంగ్రెస్ నుంచి MLA అయ్యి, 2వసారి(2019) YCP నుంచి గెలిచారు. పులపర్తి రామాంజనేయులు మొదట(2009) కాంగ్రెస్ నుంచి, తర్వాత(2014) టీడీపీ నుంచి గెలిపారు. వీరిలో ఈసారి గెలిచేదెవరో.
ప.గో జిల్లాలో తండ్రి, తల్లి, కొడుకు వేర్వేరు పార్టీల నుంచి MLAలు అయ్యారు. తాడేపల్లిగూడెం నుంచి ఈలి ఆంజనేయులు 1972లో స్వతంత్ర అభ్యర్థిగా, 1983లో TDP నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతితో ఉప ఎన్నిక రాగా.. 1983లో ఆంజనేయులు సతీమణి ఈలి వరలక్ష్మి TDP నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో ఆమె కాంగ్రెస్ నుంచి మరోసారి MLA అయ్యారు. వీరి కుమారుడు ఈలి మధుసూదనరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి MLA అయ్యారు.
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జగజ్జీవన్ నగర్‌కు చెందిన గంగాభవాని(27)కి, NTR జిల్లా మైలవరానికి చెందిన రాముతో 2011లో పెళ్లైంది. వీరికి ఒక పాప. మగ సంతానం కోసం కొద్దిరోజులుగా భర్త ఆమెను వేధిస్తున్నాడు. ఈనెల 4న పుట్టింటికి వచ్చిన భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 93% ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జిల్లాలో 16,37,430 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 15,21,928 మంది ఓటర్లకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పోలింగ్ స్టేషన్, రాష్ట్రం, జిల్లా పేరు, నంబరు, హెల్ప్ లైన్ నంబర్ పొందవచ్చన్నారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడికి గాయాలైన విషయం తెలిసిందే. కాకినాడ DSP హనుమంతరావు, శిక్షణ DSP ప్రమోద్, SI బాలాజీ సోమవారం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తాటిపర్తికి చెందిన వెంకటరమణ, వీరబాబును అదుపులోకి తీసుకొని, బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తుంది.
2019 ఎన్నికల్లో ప.గో. జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి అధ్యక్షుడు K.A పాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలో ఆయనకు 281 ఓట్లు వచ్చాయి. అందులో 278 ఈవీఎం, 3 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఇదే నియోజకవర్గంలో నోటాకు పోలైన ఓట్లు 1143. ఆ తర్వాత నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బరిలో నిలవగా 3037 ఓట్లు వచ్చాయి. నోటాకు 12,066 ఓట్లు పోలయ్యాయి.
ఏలూరులోని నిమ్మకాయల యార్డ్ రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. మృతుడి ఎడమ చేతిపై హిందీలో ‘మా’ అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు ఢీకొట్టిందా..? లేదా జారిపడ్డాడా..? తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ప్రత్యర్థుల పోటాపోటీ కౌంటర్స్‌తో ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్నికల ప్రచారం హీటెక్కగా.. పాలకొల్లులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఆదివారం ఓ కార్యక్రమంలో ఎదురుపడ్డారు. సోదరభావంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం ఉమాబాలతో కరచాలనం చేసి ముచ్చటించారు.
వేమగిరిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను నిర్దేశిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు పలు సూచనలు చేశారు. డయాస్ పాస్ కలిగిన నేతల వాహనాలు వేమగిరి జంక్షన్ విందు రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాంతంలో పార్కింగ్ చేయాలన్నారు. వీవీఐపీ పాసులు కలిగిన వాహనాలు 4ఏ వద్ద, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు పార్కింగ్-3లో, ఇతర కార్లు, ఆటోలు, బైక్స్ పార్కింగ్-1, 3 స్థలాల్లో నిలపాలన్నారు.
Sorry, no posts matched your criteria.