India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోదావరి స్నానాలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించి ప్రమాదాల బారిన పడవద్దని కొవ్వూరు రూరల్ SI సుధాకర్ హెచ్చరించారు. మద్దూరులంక, విజ్జేశ్వరం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేవులు ప్రమాదకరంగా ఉన్నందున ఎవరూ నదీ స్నానాలకు రావొద్దన్నారు. గోదావరి ప్రమాదకరంగా ఉండటంతో పాటు నాచు ఉండటంతో స్నానానికి దిగిన వారు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. కాగా.. ఇప్పటికే గోదావరిలో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య(73) పురుగు మందు తాగాడు. పరిహారం, R&R ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏలూరు జిల్లా మండవల్లిలో టెన్త్ విద్యార్థినిపై క్లాస్ రూంలోనే తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనిపై ‘X’ వేదికగా వైఎస్.షర్మిల స్పందించారు. ‘లండన్‌లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న CM జగన్‌కు రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా..?. ఈ ఘటనపై మీ మహిళా మంత్రులు , నాయకులు సిగ్గుతో తల దించుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండుపోతారో..? ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు.
చేబ్రోలు రైల్వే గేటును ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కారణంగా తాత్కాలికంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాబట్టి దూబచర్ల, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తణుకు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం నగదు లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వచ్చారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మ (55) గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలి మృతి చెందారు.
భీమవరంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదే కాలేజ్ భవనం పైనుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతడి ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. రోజులాగే బుధవారం కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. హఠాత్తుగా భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఓట్ల లెక్కింపుపై ఉమ్మడి ప.గో.లో ఉత్కంఠ నెలకొంది. ప.గో జిల్లాలో తొలి ఫలితం నరసాపురం కాగా.. ఏలూరు జిల్లాలో ఏలూరు అసెంబ్లీ ఫలితం ఫస్ట్ వెల్లడికానుంది. నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు-16 రౌండ్లు, ఉంగుటూరు-16, కైకలూరు-18, దెందులూరు-18, చింతలపూడి-21, పోలవరం-22, నూజివీడు-22 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. తొలి ఫలితం 1PM, తుది ఫలితం 6PMకు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న దెందులూరు మాజీ MLA చింతమనేని ప్రభాకర్‌కు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి కదలికలపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీని కోర్టు ఆదేశించింది.
ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో అబ్రహం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 11,500 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే నెం.8121840400కు ఫోన్ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.