WestGodavari

News May 21, 2024

ప.గో.: మాజీ MLA మృతి

image

కొవ్వూరు మాజీ MLA పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణ బాబు) మంగళవారం మృతి చెందారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఆయన స్వగృహంలో మృతిచెందారు. తణుకు, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతగా పేరుగాంచిన కృష్ణ బాబు తదనంతర కాలంలో వైసీపీలో చేరారు. పారిశ్రామికవేత్తగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణబాబు విశేష సేవలు అందించారు.

News May 21, 2024

ప.గో.: ఎలక్షన్ డ్యూటీ.. ఆ అధికారులకు రూ.20 వేతనం..!

image

ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం తదితర అక్రమ రవణాను అడ్డుకునేందుకు స్టాటిక్, ఫ్లయింగ్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటుచేశారు. అయితే ఉంగుటూరు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రెండేసి చొప్పున బృందాలను నియమించారు. 2నెలలపాటు 12గంటల చొప్పున పనిచేశారు. వేతనం కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా రోజుకు రూ.20 చొప్పున రూ.1200 చొప్పున చెల్లిస్తామన్నారు. ECఆదేశాల్లో ఇంతే ఉందని తహశీల్దార్ వెంకటశివయ్య స్పష్టం చేశారు.

News May 21, 2024

జాతీయ క్రికెట్ టోర్నీలో.. అంపైర్ మన ఏలూరు వాసి

image

జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీ అంపైర్‌గా ఏలూరుకు చెందిన ఆర్.నాగేంద్రసింగ్ ఎంపికైనట్లు మహారాష్ట్ర దివ్యాంగ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు భగవాన్ తల్వారే సోమవారం తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పుణెలో నిర్వహించే జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో అంపైర్‌గా వ్యవహరిస్తారన్నారు.

News May 21, 2024

RRR విజయం సాధించేనా..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 13 చోట్ల గెలిచింది. 2 స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. అయితే వైసీపీ MPగా గెలిచి.. ఆ పార్టీకి రాజీనామా చేసిన RRR టీడీపీలో చేరి ఉండి MLA అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మరి RRR విజయం సాధించేనా..?
– ఉమ్మడి ప.గో.లో కూటమికి ఎన్ని సీట్లు రావొచ్చు..?

News May 21, 2024

అమెరికాలో ప.గో. అమ్మాయికి ప్రశంస

image

ప.గో. జిల్లా పెనుగొండకు చెందిన మహ్మద్ నర్గీస్, ఆరీఫ్ మహ్మద్ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్ రుక్సార్‌ అమెరికాలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో ఇద్దరు నోబుల్ అవార్డు గ్రహీతల సమక్షంలో వైద్యరంగంలోని పలు అంశాలపై ప్రసంగించింది. ఈ మేరకు నోబుల్ గ్రహీతలు డేవిడ్ జూలియస్, రాంఢీ స్కెక్మాన్‌ ఆమెను అభినందించారు.

News May 21, 2024

ప.గో: స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

భీమవరంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత కలిసి సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శాఖ అధికారులకు పలు సూచనలు సలహాలను జారీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల పరిధిలో మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు. 

News May 20, 2024

పగో: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌కు రంగం సిద్ధం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సాగుకు జిల్లా వ్యవసాయధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,13,339 ఎకరాల్లో సంబంధించి పత్తి, చెరకు, వరి, వెరుశనగ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ పంపిణీకి సిద్ధం చేసింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు దుక్కులు దున్నుతున్నారు. 90 శాతం సబ్సిడీపై ఏజెన్సీ రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News May 20, 2024

ఏలూరు: ‘జిల్లా ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

image

ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ 876, ప్రైవేటు ఐటీఐలలో 1,672 మొత్తం 2,548 సీట్లు ఉన్నట్లు ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రజిత సోమవారం తెలిపారు. ఆమె మాట్లడుతూ..జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేటు ఐటీఐ కాలేజీలలో 100 శాతం అడ్మిషన్స్ కార్యచరణ చేపట్టామన్నారు. ఆయా ఐటీఐ ఖాళీలలో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 10లోపు సత్రంపాడులో దరఖాస్తులను అందజేయాలన్నారు.

News May 20, 2024

పకడ్బందీగా పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ: ఉదయ భాస్కరరావు

image

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు సంబంధిత అధికారులును ఆదేశించారు. సోమవారం ఏలూరులో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు సంబంధించి విధ్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలను కల్గకుండా పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు.

News May 20, 2024

జీలుగుమిల్లిలో అత్యధికం.. తాడేపల్లిగూడెంలో అత్యల్పం

image

ఉమ్మడి ప.గో.లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. జీలుగుమిల్లి 75.2 మి.మీ వర్షపాతం నమోదవగా.. అత్తిలి 33.8, జంగారెడ్డిగూడెం 32.8, తణుకు 32.0, ఇరగవరం 16.0, బుట్టాయిగూడెం 12.2 , పెనుగొండ 8.6, పోడూరు- పాలకోడేరు 7.4, పెంటపాడు 6.0, కొయ్యలగూడెం 4.2, పెనుమంట్ర 2.8, లింగపాలెం 2.2, పోలవరం 1.0, ఏలూరు 0.8, దెందులూరు, కామవరపుకోట 0.6, తాడేపల్లిగూడెంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.