India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడి రెబ్బా నాగేంద్రబాబు(23) మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడటంతో నాగేంద్ర ప్రాణాలు కోల్పోయాడు.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో సందడిగా కనిపించింది. సెలవు రోజు కావడంతో దూరప్రాంతాల నుంచి సైతం చాలామంది సముద్ర స్నానాలకు వచ్చారు. కొబ్బరి తోటలలో విందుల చేసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. సాగర తీరం అలలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది.

ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడేనికి చెందిన వెంకటరమణ ఆదివారం కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. ఇంటి డ్రైనేజీ శుభ్రం చేయడానికి అవసరమైన ఇనుప ఊస తేవడానికి రెండంతస్తుల డాబా పైకి వెళ్లాడు. ఊస తీస్తుండగా అది ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ వైర్ కు తాకింది. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు అరవింద్ ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధవళేశ్వరంలోని పోలవరం కుడికాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలు.. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, అతని 2వ భార్య ఉపాధినిమిత్తం ఏలూరుకు వచ్చి రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు వీరికి పరిచయం అయ్యారు. శుక్రవారం ముగ్గురితో కలిసి భర్త మద్యం తాగాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేసి భార్యపై అత్యాచారం చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందని సీఈవో సుబ్బారావు తెలిపారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో స్థాయీసంఘాల ఎన్నిక కార్యక్రమం, జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందన్నారు.

ధవళేశ్వరంలోని పోలవరం కుడికాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్దం ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాళ్ళ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన రాజేశ్ ఈ నెల 7న అనంతపురం, లంబసింగి ప్రాంతాలకు తీసుకెళ్లి <<13874134>>అత్యాచారం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తుచేసి నిందితుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

మతిస్థిమితం లేని 15ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి లోబర్చుకొని గర్భవతిని చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. 2రోజుల క్రితం కడుపునొప్పి రాగా కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి 7వ నెల గర్భిణి అని చెప్పారు. బాలిక తల్లి ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరానికి సెప్టెంబర్ 5న జరగబోవు గురుపూజోత్సవ పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ నామినేషన్లకు దరఖాస్తు స్వీకరణ ఈనెల 24 లోపు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. నామినేషన్ దరఖాస్తులను సంబంధిత మండలంలోని విద్యాశాఖ అధికారులకు సమర్పించాలన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న అవార్డు అందజేస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.