India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ, కూటమి పార్టీల నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఓటర్లు ఇరు పార్టీల్లో సమానంగా ఓటువేశారని ప్రచారం జరుగుతోంది. రెండు ఓట్లు ఒకే పార్టీకి వేశారా..? లేక వేర్వేరు పార్టీలకు వేశారా..? అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఏదేమైనా జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కురుములతోగు గ్రామానికి చెందిన జ్యోతి నిండు బాలింత. కలుషిత నీరుతాగి అతిసారం బారిన పడగా భధ్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. జ్యోతి కోలుకోవడమే కష్టంగా ఉన్నతరుణంలో ఆమె బిడ్డను మరో తల్లి దగ్గరకు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన సోమమ్మ సైతం బాలింత కావడంతో తన బిడ్డతో పాటు జ్యోతి బిడ్డకు సైతం చనుబాలు ఇస్తోంది. ఇంట్లో 2 చీరలతో ఊయలలు ఏర్పాటుచేసింది.
ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ పరిధి ఇందిరమ్మ కాలనీలో ఈ ఏడాది అక్టోబర్ 29న ఓ గదిలో భద్రపరిచిన ఐరన్ రాడ్స్ చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మణ్ బాబు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నేరం రుజువు కావడంతో అదే కాలనీకి చెందిన చోటే ఖాన్(25)కు 6 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏలూరు ఎక్సైజ్ కోర్ట్ జడ్జి స్పందన శుక్రవారం తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు.
నల్లజర్ల మండలం అనంతపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఆత్మీయ సమావేశం పెట్టకూడదని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఇలాంటి సమయంలో ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని కొవ్వూరు డీఎస్పీ రామారావు తెలిపారు.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలోని మేజర్ కెనాల్‌లో ఉపాధి హామీ పనులు ముగించుకొని వస్తూ ఓ కూలి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన రొట్టె వీర్రాజు(63) శుక్రవారం ఉదయం పని ముగించుకుని వస్తూ ఇంటికి కూతవేటు దూరంలో గుండెపోటుకు గురయ్యాడు. స్థానికులు స్పందించి ఏఎన్ఎం వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే వీర్రాజు మృతి చెందినట్లు వారు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి, ముందస్తు శుభాకాంక్షలు తెలిపినట్లు RRR పేర్కొన్నారు.
దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావుపై పెదవేగి పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైందని SI దుర్గాప్రసాద్ శుక్రవారం తెలిపారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో టీడీపీ- వైసీపీ గొడవల నేపథ్యంలో రాజేష్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన చింతమనేని ప్రభాకర్ రావు అక్కడికి వెళ్లి రాజేష్‌ను తీసుకువెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదుచేశారు.
నాలుగేళ్ల బాలుడు గోతిలో పడి మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చంటి అమలాపురంలో SIగా విధులు నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చారు. కాగా గురువారం ఎస్ఐ కుమారుడు (4) ఆడుకుంటూ ఇంటి వెనకాల ఉన్న గోతిలో పడి మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పందేలు కాస్తున్నారు. ఓవైపు IPL బెట్టింగులు కొనసాగుతుండగా.. మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మెజారిటీ ఎంతవస్తుందని బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తణుకులో రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డెన్లు ఏర్పాటుచేసుకుంటున్నట్లు సమాచారం.
– మీ వద్ద ఉందా..?
ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పెదవేగి SI రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదివిన బాలికను పెళ్లిచేసుకుంటానని ఈ నెల 10న కవ్వకుంటకు చెందిన బెజవాడ పవన్ బయటకు తీసుకెళ్లాడు. బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో.. యువకుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Sorry, no posts matched your criteria.