India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లాకు కొయ్యలగూడెంకు చెందిన రైతుకు ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు అతిథిగా అందింది. ఆదర్శరైతుగా గుర్తింపు పొందిన ఆయన తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. సేంద్రియ ఎరువులను వినియోగించి యాంత్రీకరణతో అధిక దిగుబడి సాధించడం, బిందు సేద్యంతో పంటలు పండించడం వంటివి చేశేవారు. దీంతో పీఎం కిసాన్ పథకంలో ఈ వేడుకలకు ఎంపికయ్యారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులపై శాసనసభ్యులు, అధికారులతో మంత్రి సమీక్షించారు.

చిరకాల మిత్రుడు, విద్యావేత్త పితాని సూర్యనారాయణ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పోడూరు మండలం కొమ్ము చిక్కాలలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పితాని సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పితాని సూర్యనారాయణతో ఉన్న స్నేహాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

తణుకు మండలం తేతలిలోని గౌతమి స్పిన్ టెక్ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కర్మాగారానికి ఫైర్ అనుమతులు లేనట్లు తెలుస్తోంది.

ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై చోదిమెళ్ల వద్ద బైకును పాల వ్యాను ఢీకొట్టింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు. దీనికి నరసాపురం మున్సిపాల్టీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో సేవలు చేస్తున్న పలు వర్గాల వ్యక్తులకు ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈక్రమంలో కరోనా సమయంలో విస్తృత సేవలు అందించిన గుమ్మడి స్వామినాయుడును విందుకు ఆహ్వానించారు.

ప.గో. జిల్లాలో ఎక్కడైనా రోడ్లపైకి ఆవులను, గేదెలను వదిలితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరెట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పశువుల కారణంగా జాతీయ రహదారులు, పట్టణాల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు అవడం, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. వాటి యజమానులకు ముందుగా సమాచారం అందించి హెచ్చరికలు జారీ చేయాలని, మార్పు రాకపోతే ఆవులను గోశాలలకు తరలిస్తామన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భీమవరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలోని శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు.

దెందులూరు మండలం సత్యనారాయణపురం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ నబీ, ఎస్ఐ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని లారీకింద ఇరుక్కుపోయిన కారును బయటకు తీసే చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.