India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమార్తె దీపిక సోమవారం ప.గో. జిల్లా తణుకులో ప్రచారం చేపట్టారు. పట్టణంలోని స్థానిక 24వ వార్డులో తణుకు MLAగా నాన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
ప.గో. జిల్లా కొవ్వూరు ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుండి 9 మంది ప్రయాణుకులతో కొవ్వూరు వైపు వస్తున్న ఓమ్నీ వ్యాన్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొవ్వూరు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి రాజమండ్రి తరలించారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 43,948 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో ఏలూరు జిల్లాలో బాలురులు 8,513, బాలికలు 10,036 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప.గో లో బాలురు 8,262, బాలికలు 8,745 మంది ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ అధికారులు సోమవారం తెలిపారు.
కూటమికి ప్రజలు మద్దతు తెలపాలని రాజమండ్రి లోక్‌సభ కూటమి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు. సోమవారం నిడదవోలులో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ MLAగా కూటమి అభ్యర్థి కందుల దుర్గేశ్‌ను, ఎంపీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు గ్రామానికి చెందిన పామర్తి రంగారావుగా (45) గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పెదవేగి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప.గో. జిల్లాలో YCP, TDPలు చెరోస్థానంలో సిట్టింగ్ MLAలను కాదని ఇతరులకు కేటాయించాయి. 2019లో చింతలపూడి వైసీపీ MLAగా నియోజకవర్గ చరిత్రలో అధిక మెజారిటీ సాధించి గెలిచిన ఎలీజాను ఆ పార్టీ ఈ సారి పక్కనపెట్టి విజయరాజుకు అవకాశం ఇచ్చింది. ఉండిలో టీడీపీ MLA రామరాజును కాదని కూటమి అభ్యర్థిగా ఆ పార్టీ RRRకు అవకాశమిచ్చింది. మరి ఈ 2చోట్ల ఆయా పార్టీల గెలుపు సులువయ్యేనా..?
– మీ కామెంట్..?
నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం పెద అమిరంలోని NTR విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందిస్తారని కూటమి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్ వేసేందుకు సోమవారం భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రఘురామను పార్టీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించాయి. అనంతరం పెద అమిరం గ్రామంలోని RRR నివాసం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ర్యాలీగా వచ్చారు. ఉండి తహశీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు.
10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది.
➤ పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 81.82 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది.
➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 64.35 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 80.08% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది.
☞ ‘పది’ ఫలితాలలో 81.82 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. 20,785 మంది పరీక్షలు రాయగా.. 17,007 (BOYS-8,262, GIRLS-8,745) మంది పాసయ్యారు.
☞ ఏలూరు జిల్లాలో 23,163 మంది పరీక్షలు రాశారు. వీరిలో 18,549 (BOYS-8,513, GIRLS-10,036) మంది ఉత్తీర్ణులయ్యారు. 80.08 శాతంతో ఈ జిల్లా 25వ స్థానంలో నిలిచింది.
Sorry, no posts matched your criteria.