India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 83.04%.. పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉంగుటూరులో అత్యధికంగా 87.75%, అత్యల్పంగా ఏలూరులో 71.02% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.
ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఓట్ల పండగ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కాగా సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలో 68.98, ఏలూరు జిల్లాలో 71.10 పోలింగ్ శాతం నమోదైంది. ఇంతకీ మీరు ఓటు వేశారా..? మీ వద్ద పోలింగ్ ఎలా జరిగింది..?
– కామెంట్ చేయండి.
ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధి గిలకలగేటు వద్ద సోమవారం రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ నరసింహారావు వివరాలు తెలిపారు. మృతుడు మాచిరెడ్డి శ్రీ మహావిష్ణు(34) నిడదవోలు మండలం రాయ్‌పేటలోని భూపతి వెంకటరాజు వీధికి చెందినవాడని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వెళ్తున్న క్రమంలో రైలు నుండి జారిపడి మృతి చెందాడని పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని కాలింగగూడెం గ్రామంలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిల్చొని ఓటు హక్కు వేశారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వేయడం తన బాధ్యత అని తెలిపారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT
ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గొన్నూరి రాజు-మరియమ్మ దంపతుల కుమారుడు సిద్ధూ(3) మృతి చెందాడు. వీరు ఆదివారం నల్లజర్ల మండలం దూబచర్లలో బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లారు. అక్కడ సిద్దూ మారాం చేయగా.. బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. సిద్ధూపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఏలూరు జిల్లా గోదావరి నది మధ్యలో ఉన్న కసనూరు గిరిజన తండా ప్రజలు పోలింగ్ సిబ్బందికి వారి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో 472 మంది ఓటర్లు ఉన్నారు. కసనూరు గ్రామానికి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొండారెడ్డి గిరిజన తెగవారు వారి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలకడం, సత్కరించడం ఆనవాయితీ. పోలింగ్ సిబ్బంది వస్తున్నారని తెలుసుకున్న గిరిజన ప్రజలు సిబ్బందికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు వారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.
ప.గో. జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన చెవల మహేశ్ HYD బంజారాహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత CM కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ 2 సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.