India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ యువజన పార్టీ తరఫున పోటీ చేయనున్న MLA అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిప్పేటి వడ్డీకాసులు, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమ గోపాల్, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.నిరీక్షణ రావును బరిలో దింపుతున్నట్లు పేర్కొన్నారు.
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఈనెల 23న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 23న ఉదయం 9 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆశ్రం)కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్డాండర్డ్‌రైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు దక్కినట్లు డైరెక్టర్ జి.రతీదేవి తెలిపారు. ఆశ్రంలో అందుబాటులోకి తెచ్చిన ప్రపంచస్థాయి సౌకర్యాలు, వైద్య సేవలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, శక్తి, పర్యావరణ అనుకూల వ్యవస్థకు ఐఎస్ఓ 5 సర్టిఫికెట్లు అందించిందన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప.గో జిల్లాలో
పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ముత్యాలపల్లి, లోసరి, బర్రెవానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం పట్టణానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్‌లో జరిగే బహిరంగ సభలో వారాహి పైనుంచి మాట్లాడుతారు. రాత్రి స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్హాల్లో బస చేస్తారు.
వైసీపీలో యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించామని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలో యాదవ సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులిచ్చి సీఎం జగన్ గౌరవించారన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, సంపత్ కుమార్ పాల్గొన్నారు.
అనుమానంతో భార్య, పిల్లలను లోపల ఉంచి ఇంటికి నిప్పుపెట్టాడో భర్త. ఈ ఘటన భీమడోలులో జరిగింది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. అర్జావారిగూడెంకు చెందిన నాగరాజు-వెంకటలక్ష్మికి 2009లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాగరాజు అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఈనెల 15న భార్య, పిల్లలను ఇంట్లో వేసి నిప్పు పెట్టాడు. వారు కేకలేస్తూ తలుపులు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కొవ్వూరు రోడ్డు, రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్ సిటీ ఏరియాకు చెందిన భార్గవి(26) ఓ బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన భార్గవి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహం లభ్యమైంది.
ఉమ్మడి ప.గో.లో ‘ఉండి’ హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇక్కడ టీడీపీ టికెట్‌పై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఉండిలో ఎంపీ రఘురామ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు కాగా.. రామరాజు 22న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. నిన్న కేడర్ రామరాజు సమావేశం కాగా.. అంతలోనే చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చిందని, శనివారం ఆయనను కలిసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రామరాజు నేతలకు తెలిపారు.
ఎంసీఎంసీ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు.
ఏలూరు జిల్లా పోక్సో కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గోపాలపురం మండలం పెద్దగూడెంకు చెందిన సంపత్‌రావు(81) అనే వృద్ధుడు 2017లో ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించిందని, బాలికకు రూ.2,50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించిందని పోలీసులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.