India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ప్రభుత్వ, 16 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు అనంతరం సమీపంలోని ఎన్ఆర్పీ అగ్రహారం, ఆచంటలోని ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకొని రసీదు పొందాలన్నారు.
ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురం క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. – మన ప.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి 48 గంటలు పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. దీంతో భీమవరం పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు పోటెత్తారు. ఇప్పటికే దుకాణాలలో మద్యం నిల్వలు చాలా వరకు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.- మీ వద్ద పరిస్థితి ఏంటి..?
ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్‌ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
భీమవరంలో రేపు జరగవలసిన బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్‌షో రద్దయింది. షా బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమం రద్దయినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైతుల మధ్య మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా గురువారం ప.గో. జిల్లా పెదఅమిరంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ 5 నెలల కింద నగదు విడుదల చేసిన పథకాలకు డబ్బు జమ చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
– RRR వ్యాఖ్యలపై మీరేమంటారు..?
ప.గో జిల్లా భీమవరం మండలం లోసరి చెక్‌పోస్ట్ వద్ద ఉదయం రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.87 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకే ఊరికి చెందిన ఇద్దరు MLA అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారే శ్రీరంగనాథరాజు, పీవీఎల్ నరసింహరాజు. ప.గో జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన వీరిద్దరూ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. శ్రీరంగనాథరాజు ఆచంట నుంచి.. పీవీఎల్ ఉండి నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీ చేయగా.. శ్రీరంగనాథరాజు పితాని సత్యనారాయణపై గెలిచారు. పీవీఎల్ మంతెన శివరామరాజుపై ఓడారు.
ఉండిలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఉండి ప్రధాన వంతెన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు కోరారు.
Sorry, no posts matched your criteria.