India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దెందులూరు మండల పరిధిలోని కొవ్వలి గ్రామంలో 30 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామని, అలాంటి మాపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా తమపై నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, దానిని సహించలేక రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద విస్తృత వాహన తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం రూ. 22,18,600 నగదు, 140 లీటర్ల మద్యం, 16.258 కిలోల బంగారం, 31.42 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కుక్కునూరులో ఆదివారం జరిగిన ఓ ఘరానా మోసం ఆలస్యంగా వెలువడింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంక్ యజమానికి ఆదివారం ఓ కొత్త నంబర్‌తో ఫోన్ వచ్చింది. తాను ఏఎస్ఐనని అర్జెంటుగా నగదు అవసరమని గుర్తు తెలియని వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో రూ.34 వేల నగదును యజమాని సిబ్బంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు. మోసపోయారని ఆలస్యంగా తెలియడంతో మండల పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు.
పెదపాడు మండలం కలపర్రు టోల్ గేటు వద్ద సోమవారం పట్టుబడిన నగదు వివరాలను అధికారులు వెల్లడించారు. ఒక వాహనంలో రూ.15,52,300 నగదు మరో వాహనంలో 16.528 కేజీల బంగారు ఆభరణములు, 31.042 కేజీల వెండి ఉందన్నారు. నగదు, ఆభరణాలకు సంబంధించిన యజమానులు సరైన పత్రాలను జిల్లా త్రిసభ్య కమిటీ వారికి సమర్పించాలన్నారు. పరిశీలించిన తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతా జిల్లా ప్రజలకు శుభాలు కలగాలని, ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిచారు. పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రచార చేస్తున్న ఓ వాహనాన్ని కొవ్వూరు పోలీసులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. కొవ్వూరులో ఓ పార్టీ నాయకులు అనుమతి తీసుకోకుండా ప్రచార వాహనాన్ని కాలనీల్లో తిప్పుతున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులు అనుమతిపత్రాలు అడగగా.. అవి లేకపోవడం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వాహనంతో పాటు సౌండ్ బాక్స్‌లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు రైల్వేగేట్ షుగర్ ఫ్యాక్టరీ సమీప పట్టాలపై ఆదివారం రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి వివరాలను హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సోమవారం వెల్లడించారు. ద్వారకాతిరుమల వాసి వై.గణేష్(22) ప.గో జిల్లా నరసాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఫ్రెండ్స్‌ను కలిసి వస్తూ రైలు ప్రమాదానికి గురై గణేష్ మృతి చెందినట్లు తెలిపారు.
ప.గో. జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి పెట్రోల్ బంకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో.జిల్లా నుంచి కొబ్బరి దింపు కార్మికులు కాజ వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి కాకినాడ వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తూ.గో. జిల్లా గుడిమూడులంకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. యలమంచిలి ఎస్సై శివనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన 3 ప్రధాన నగరాలు ఉండటం గమనార్హం. భీమవరంలో 42.0, తాడేపల్లిగూడెంలో 41.0, ఏలూరులో 41.0 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లో సోమవారం వడగాల్పులకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది.
– మీ వద్ద ఎలా ఉంది..?
Sorry, no posts matched your criteria.