WestGodavari

News April 17, 2024

ప.గో జిల్లాలో సీఎం జగన్ షెడ్యూల్ ఇలా

image

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం షెడ్యూల్ అధికారికంగా పార్టీ నాయకులు ప్రకటించారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారులో బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. తణుకు, పెరవలి, సిద్ధాంతం, రావులపాలెం, ఆలమూరు, కడియం మీదుగా కడియపులంక చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.

News April 17, 2024

ప.గో: సివిల్స్‌లో సత్తా చాటిన నవ్యశ్రీ

image

తాడెపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ పూర్వ విద్యార్థి గోవాడ నవ్యశ్రీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 995వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. నాలుగో సారి రాసిన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడంతో పాటు ఐఆర్ఎస్ ర్యాంకు అధికారిగా ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నట్టు నిట్ వర్గాలు తెలిపాయి. ఆమెను నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ మూర్తి, అధ్యాపకులు అభినందించారు.

News April 17, 2024

ప.గో: బిల్డింగ్ పై నుంచి కింద పడి కార్మికుడు మృతి

image

గోపాలపురం మండలం బీమోలు గ్రామంలో పండగ నాడు విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో బిల్డింగ్ పైన పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన క్షతగాత్రుణ్ణి గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు యాసిన్ (40)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేశారు.

News April 17, 2024

సివిల్స్‌లో గోదారి బిడ్డకు SUPER ర్యాంక్

image

ప.గో. జిల్లా కాళ్ల మండలం సీసలికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష UPSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో 198 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించగా.. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఈమె తండ్రి రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఉష గృహిణి.

News April 17, 2024

ఏలూరు: యువతిపై అత్యాచారం.. పదేళ్ల జైలు

image

ఏలూరు జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సాక శివకు పదేళ్ల జైలు శిక్ష, రు.2500/- జరిమానా విధించినట్లు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు. 2021 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిందని పేర్కొన్నారు.

News April 17, 2024

ప.గో.: నేడు CM జగన్ బస్సు యాత్రకు BREAK

image

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు నేడు విరామం ఇచ్చారు. తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన ఆయన బుధవారం రాత్రి కూడా సైతం ఇక్కడే బస చేయనున్నారు. రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది. శిబిరం నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.

News April 17, 2024

సివిల్స్‌లో మెరిసిన శాసనమండలి ఛైర్మన్ తనయుడు

image

శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.

News April 16, 2024

సివిల్స్ మెరిసిన శాసనమండలి ఛైర్మన్ తనయుడు

image

శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.

News April 16, 2024

ప.గో.: 18వ తేదీలోపు సస్పెన్స్‌కి తెరపడుతుంది: RRR

image

తాను ఎక్కడ నుండి పోటీ చేస్తానన్న విషయంపై ఈ నెల 18వ తేదీ లోపు స్పష్టత వస్తుందని సస్పెన్స్‌కి తెరపడుతుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయు విషయంపైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి తన నుదుటిన ఏం రాశాడో అంటూ వ్యంగంగా స్పందించారు.

News April 16, 2024

ఏలూరు: సీఎం జగన్ బస్సు యాత్ర షురూ..

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. సోమవారం రాత్రి నారాయణపురంలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.