India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లా కారాగారాన్ని శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. కారాగారంలో ఖైదీలకు అందిస్తున్న ఆహారం, నీరు, వైద్య సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసులలో ఉన్న ముద్దాయిలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా ఉచితంగా కేసులు వాదిస్తామన్నారు. సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు.

ఉండి నియోజకవర్గంలో మొదటి రోజే 99శాతం ఫించన్ల పంపిణీ చేశామని MLA రఘురామకృష్ణరాజు (RRR) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, అందుకోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పెంచిన ఫించన్ రూ.4,000 అందుకున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని ఆయన అన్నారు.

విద్యార్థులు, అభ్యాసకులు ఏపీ ఓపెన్ స్కూల్‌లో చేరేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ప.గో కలెక్టర్ నాగరాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ స్కూల్‌లో చేరుటకు ఆసక్తితో ఉన్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పెనాల్టీ లేకుండా ప్రవేశ ఫీజు చెల్లించుటకు ఆగస్టు 27 వరకు గడువు ఉందన్నారు. రూ.200 పెనాల్టీతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. ☞ SHARE IT..

ఉమ్మడి ప.గో జిల్లాలో జూన్ 24 నుంచి 27 వరకు జరిగిన డీఈఎల్ఈడీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ఏలూరు డీఈవో అబ్రహం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంబంధించిన డమ్మీ మెమోను “www.bse.ap.gov.in” వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. రీకౌంటింగ్ కొరకు సీఎఫ్ఏంఎస్ ద్వారా రూ.500 చెల్లించి దరఖాస్తుతో చలానా, మెమోను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం విజయవాడకు పంపాలన్నారు. SHARE IT..

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ప్రమోషన్‌లో శుక్రవారం సినీ నటి నిహారిక కొణిదెల పాల్గొన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కళాశాల పాలకవర్గ కార్యదర్శి సుబ్బారావు హాజరయ్యారు. వంశీ దర్శకత్వంలో యువతకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాన్ని తాను నిర్మించినట్లు నిహారిక వెల్లడించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఓ కారుపై భారీ హోర్డింగ్ విరిగిపడింది. షాపు ముందు కారు పార్క్ చేస్తున్న సమయంలోనే బోర్డు పడిపోవడంతో ముందు భాగం దెబ్బతింది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

భీమడోలు మండలపరిధిలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గుండుగొలను సమీపంలోని రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్‌పై వస్తున్న ఓ యువకుడు వెనకనుంచి ఢీకొట్టాడు. దీంతో అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళా కానిస్టేబుల్‌పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న ఓ వ్యక్తిపై ఏలూరు జిల్లా కైకలూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేశారు. SI రామకృష్ణ తెలిపిన వివరాలు..మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ (వివాహిత)పై అదే మండలానికి చెందిన సైదు స్వామిజీ కుమార్ కొద్దిరోజులుగా అసభ్యకరంగా, కానిస్టేబుల్ తన భార్య అంటూ పోస్ట్ చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు SI తెలిపారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గోదావరి జలాల పంపిణీ నిలిపివేసినట్లు డీఈఈ పెద్దిరాజు గురువారం సాయంత్రం తెలిపారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి ఇప్పటి వరకూ 10.3545 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసినట్లు డీఈ తెలిపారు. కృష్ణా నది వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు అధికంగా ఉండడం వలన నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

ఏలూరులోని తూర్పులాకుల రైల్వే గేట్ సమీప రైల్వే పట్టాలపై రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్ఐ సైమన్ మాట్లాడుతూ.. మృతుడి వయస్సు 30 నుంచి 35ఏళ్ల లోపు ఉంటుందన్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. కేసు నమోదు చేసి డెడ్‌బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.