India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీ-విజిల్ యాప్‌లో ఇప్పటివరకు అందిన 181 ఫిర్యాదులలో 95 ఫిర్యాదులను పరిష్కరించామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మరో 86 ఎన్నికలకు సంబంధం లేని ఫిర్యాదులు రాగా వాటిని తిరస్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తంగా రూ.81.76 లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. జిల్లాలో నిరంతరంగా సర్వేలైన్స్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.
అభిమానాన్ని పెళ్లి కార్డుల రూపంలో చూపుడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ప.గో జిల్లా ఆచంటలో ఓ యువకుడు TDPపై అభిమానాన్ని చాటుకున్నాడు. పెళ్లి కార్డుపై ‘ఓట్ ఫర్ టీడీపీ’ అంటూ ఆచంట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటోలు ముద్రించుకున్నాడు. కార్డు వెనుక వైపు ‘మన ఆచంట- మన పితాని’ అని రాసి ఉన్న ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నరసాపురం సిట్టింగ్ MP రఘురామకృష్ణరాజు పోటీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన పలుమార్లు అన్నప్పటికీ బీజేపీ అధిష్ఠానం శ్రీనివాసవర్మ పేరు ప్రకటించింది. దీంతో RRR కేడర్ సందిగ్ధంలో పడింది. అయితే.. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నరసాపురం MPగా కాకుంటే ప.గో జిల్లాలో MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో జిల్లాలో RRR సీటు పొలిటికల్ హీట్ పెంచుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాహుల్ కేసరి అనే మావోయిస్టు తప్పించుకున్నాడు. కొద్దిరోజులు అతడు HYDలో తలదాచుకొని, 15 రోజుల కింద భీమవరం వచ్చి వలస కార్మికులతో తాపీ పనులు చేస్తున్నాడు. ఫోన్ ఆధారంగా భీమవరం వచ్చిన ఝార్ఖండ్ పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.
ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) శనివారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్షేమ పథకాల్లో వాలంటీర్ల జోక్యం లేకుండా చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్‌తో కేసు వేయించి ఆపివేయించారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం రాత్రి తణుకు మండలం మండపాకలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయించి కుట్ర చేశారని ఆరోపించారు.
ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు(1962-2019) 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3సార్లు మహిళలు MLAలుగా గెలిచారు. 1978లో దాసరి సరోజినిదేవి(కాంగ్రెస్‘ఐ‘), 2004లో మద్దాల సునీత(కాంగ్రెస్‘ఐ’), 2009లో తానేటి వనిత(TDP) నుంచి గెలుపొందారు. ఇక్కడి నుంచి వనిత మరోసారి MLA అభ్యర్థిగా బరిలో ఉంటుండగా.. ఈసారి పార్టీ మాత్రం వేరు. ఆమె 2009లో TDP నుంచి పోటీ చేసి గెలవగా.. ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.
హోల్‌సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు తాడేపల్లిగూడెం. ఇక్కడి ఓటర్ల నాడి అంత ఈజీగా పట్టలేం. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ.. ఇలా ప్రతి పార్టీకి పట్టం కడుతూ విభిన్న తీర్పు ఇస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున బొలిశెట్టి సత్యనారాయణ(జనసేన) బరిలో ఉండగా.. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. మరి ఈసారి తాడేపల్లిగూడెం ఓటర్లు ఏం తీర్పునిచ్చేనో చూడాలి.
చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ ఏలూరులో ఓ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతినగర్ 7వ లైన్ కాలనీవాసులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగటానికి రావద్దని, 20ఏళ్ల నుంచి తమ కాలనీని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత కాలనీ వైపు తొంగిచూసిన వారే లేరని, డ్రైనేజ్ తీయకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.