India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుల టైర్లు, బ్యాటరీలు చోరీ చేసిన నలుగురిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం.. కామవరపుకోటలోని ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన 2 బస్సుల టైర్లు, బ్యాటరీలు, జాకీలు, ఇతర సామగ్రి పోయినట్లు నందిగామ ధర్మరాజు ఫిర్యాదు చేశాడు. విచారణలో చందు, ఈశ్వర్ కుమార్, సాయి దుర్గారావు, వెంకట్ కాజేశారని తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఏలూరు జిల్లాలో 9మంది SIలు బదిలీ అయ్యారు. భీమడోలు ఎస్సైగా సుధాకర్, లక్కవరం ఎస్సై సుధీర్ ద్వారకాతిరుమల స్టేషన్‌కు, ద్వారకాతిరుమల ఎస్సై సతీష్ వీఆర్‌కు, తడికలపూడి ఎస్సై జైబాబు టి.నరసాపురానికి, టి.నరసాపురం ఎస్ఐ మహేశ్వరరావు వీఆర్‌కు, చింతలపూడి ఎస్సైగా కుటుంబరావు, జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ కొయ్యలగూడెం స్టేషన్‌కు, కొయ్యలగూడెం ఎస్సై విష్ణువర్ధన్ వీఆర్‌కు, నిడమర్రు ఎస్సై శ్రీను వీఆర్‌కు బదిలీ అయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం చోటుచేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో కె.జాన్‌బాబు(17) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాన్‌బాబు తణుకుకు చెందిన వాడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆదివారం.. అందులోనూ ఫ్రెండ్‌షిప్ డే కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా పేరుపాలెం బీచ్ వెళ్లాడు. స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు.

ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన ఫణి కుమార్ అనే వ్యక్తికి కొంతమంది ఫోన్ చేసి రూ.10 లక్షలకు రూ.44 లక్షలు ఇస్తానని చెప్పారు. దీంతో ఫణికుమార్ సందేహంతో పోలీసులకి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఒక సెల్‌ఫోన్ , నకిలీ కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ఎర్రకాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం స్థానిక మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించి జంగారెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. మృతిరాలికి సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్ట్ ఎగువన గోదావరి నీటిమట్టం క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 6,70,355 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. కడెమ్మ స్లూయిజ్ వద్ద గేట్లు వరద నీటి నుంచి బయటపడడంతో ఏటిగట్టుకి కుడివైపున పంటపొలాల్లో ఉన్న వరద జలాలు వేగంగా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి.

కానిస్టేబుల్‌పై కేసు నమోదైన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. ఏలూరులోని వంగాయగూడేనికి చెందిన లింగేశ్వరరావు ఇస్త్రీ బండి నిర్వహిస్తున్నారు. అతనితో గ్రామీణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస రెడ్డి పరిచయం పెంచుకున్నారు. లింగేశ్వరరావు కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాల్లో రూ.7 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

బుట్టాయిగూడెం మండలం కొరసావారిగూడెం అటవీ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లీ దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు ఉదయం 7 గంటల లోపు వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చని సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా వంట కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 3 గంటలలోపు తిరుగు ప్రయాణం కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరారు.

ఉమ్మడి పశ్చిమ గోదారోళ్లు స్నేహమంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. ఇక పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు..?
☞ Happy Friendship Day

ఏలూరు జిల్లా దెందులూరు-అలుగులగూడెం మధ్య రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని 30 ఏళ్ల వయసు గల వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.