India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.
ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం 7గంటల నుంచి మంగళవారం సాయంత్రం 7 వరకు రూ.22 వేల విలువ కలిగిన 88.60 లీటర్ల మద్యం, బెల్లం ఊట-1200 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.7,61,460 నగదును సీజ్ చేశారని ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. ప్రలోభాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.
ప.గో జిల్లా తణుకు పట్టణంలో బుధవారం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. మధ్యాహ్నం 3:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:45 గంటలకు నరేంద్ర సెంటర్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7:00 నుంచి 8:30 వరకు నిడదవోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఏలూరు MP అభ్యర్థిగా కావూరి లావణ్యను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక్కడి నుంచి కావూరి సాంబశివరావు 2004, 2009 ఎన్నికల్లో 2సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ‘కావూరి’ ఫ్యామిలీకి చెందిన NRI లావణ్య కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్నారు. సాంబశివరావు కేంద్ర మంత్రిగా ఏలూరులో తనదైన ముద్ర వేశారు. కాగా.. ఇక్కడ వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, కూటమి నుంచి పుట్టా మహేశ్ బరిలో ఉన్నారు.
భారత చైతన్య యువజన పార్టీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామికి టికెట్ కేటాయించారు. ప్రముఖ న్యాయవాదిగా, మాజీ కౌన్సిలర్‌గా పని చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసి రాజీనామా చేశారు.
చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దెందులూరు మండల పరిధిలోని కొవ్వలి గ్రామంలో 30 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామని, అలాంటి మాపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా తమపై నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, దానిని సహించలేక రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద విస్తృత వాహన తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం రూ. 22,18,600 నగదు, 140 లీటర్ల మద్యం, 16.258 కిలోల బంగారం, 31.42 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కుక్కునూరులో ఆదివారం జరిగిన ఓ ఘరానా మోసం ఆలస్యంగా వెలువడింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంక్ యజమానికి ఆదివారం ఓ కొత్త నంబర్‌తో ఫోన్ వచ్చింది. తాను ఏఎస్ఐనని అర్జెంటుగా నగదు అవసరమని గుర్తు తెలియని వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో రూ.34 వేల నగదును యజమాని సిబ్బంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు. మోసపోయారని ఆలస్యంగా తెలియడంతో మండల పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు.
పెదపాడు మండలం కలపర్రు టోల్ గేటు వద్ద సోమవారం పట్టుబడిన నగదు వివరాలను అధికారులు వెల్లడించారు. ఒక వాహనంలో రూ.15,52,300 నగదు మరో వాహనంలో 16.528 కేజీల బంగారు ఆభరణములు, 31.042 కేజీల వెండి ఉందన్నారు. నగదు, ఆభరణాలకు సంబంధించిన యజమానులు సరైన పత్రాలను జిల్లా త్రిసభ్య కమిటీ వారికి సమర్పించాలన్నారు. పరిశీలించిన తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.