India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతా జిల్లా ప్రజలకు శుభాలు కలగాలని, ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిచారు. పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రచార చేస్తున్న ఓ వాహనాన్ని కొవ్వూరు పోలీసులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. కొవ్వూరులో ఓ పార్టీ నాయకులు అనుమతి తీసుకోకుండా ప్రచార వాహనాన్ని కాలనీల్లో తిప్పుతున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులు అనుమతిపత్రాలు అడగగా.. అవి లేకపోవడం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వాహనంతో పాటు సౌండ్ బాక్స్‌లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు రైల్వేగేట్ షుగర్ ఫ్యాక్టరీ సమీప పట్టాలపై ఆదివారం రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి వివరాలను హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సోమవారం వెల్లడించారు. ద్వారకాతిరుమల వాసి వై.గణేష్(22) ప.గో జిల్లా నరసాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఫ్రెండ్స్‌ను కలిసి వస్తూ రైలు ప్రమాదానికి గురై గణేష్ మృతి చెందినట్లు తెలిపారు.
ప.గో. జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి పెట్రోల్ బంకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో.జిల్లా నుంచి కొబ్బరి దింపు కార్మికులు కాజ వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి కాకినాడ వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తూ.గో. జిల్లా గుడిమూడులంకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. యలమంచిలి ఎస్సై శివనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన 3 ప్రధాన నగరాలు ఉండటం గమనార్హం. భీమవరంలో 42.0, తాడేపల్లిగూడెంలో 41.0, ఏలూరులో 41.0 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లో సోమవారం వడగాల్పులకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది.
– మీ వద్ద ఎలా ఉంది..?
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని నరేంద్ర కూడలిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు ఏర్పాట్లపై కసరత్తు మొదలుపెట్టారు. ఇరు పార్టీల అధ్యక్షులు సభ నిర్వహణకు ముందు ఒకే వాహనంపై పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ఉండనున్నట్లు నాయకులు చెబుతున్నారు.
ఏలూరు జిల్లాలో 16.25 లక్షల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటు హక్కు సద్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మే 13న జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం వాట్సాప్ నెం 94910 41435 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ఫొటో, వీడియోతో పై నెంబరుకు పంపాలని ప్రజలకు సూచించారు.
ఏలూరులోని వి-మాక్స్ థియేటర్‌లో ఆదివారం ‘టిల్లు స్క్వేర్’ మూవీ టీం సందడి చేసింది. ఈ మూవీ విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. రూ.100 కోట్లు వసూలు చేసిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో జొన్నలగడ్డ సిద్ధూ మాట్లాడుతూ.. మూవీకి ఇంతటి ఘనవిజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు. డైరెక్టర్ మల్లిక్ రామ్, తదితరులు ఉన్నారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు రైల్వేగేట్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని రైల్వే పట్టాలపై ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. రైల్వే రైటర్ ఆదినారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో ఆదివారం పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పెన్షనర్లు పడే ఇబ్బందులు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తానని అన్నారు.
Sorry, no posts matched your criteria.