India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చింతలపూడిలో రాజకీయం ఆసక్తిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కొత్తఅభ్యర్థి కంభం విజయరాజుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కాదని కొత్త అభ్యర్థి సొంగా రోషన్‌ను ప్రకటించింది. అయితే నియోజకవర్గ ఓటర్లు 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు అధికారం కట్టబెడుతూ వచ్చారు. మరి ఈ సారి ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.
భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు ఓ ప్రత్యేకతను కైవసం చేసుకున్నారు. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. గతంలో 2 వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందిన ఆయన తాజాగా మరోపార్టీ నుంచి బరిలో ఉన్నారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని మలకపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన ఓ టిఫిన్ సెంటర్‌లో గారెలు, బజ్జీలు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పాలకొల్లులో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉండి MLA అభ్యర్థిగా సిట్టింగ్ MLA మంతెనను కాదని RRRకు కేటాయించినట్లు వార్తలు రావడంతో మంతెన అభిమానులు బాబు కాన్వాయ్ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ తర్వాత టికెట్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వలేదని మంతెన, RRR వేర్వేరుగా మీడియాతో వెల్లడించారు. దీంతో సందిగ్ధత నెలకొంది.
– మీ కామెంట్..?
ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్ శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే తప్ప పల్లకీలు మోసే బోయలు కాదని అన్నారు.
గణపవరంలో ఎస్ ఎఫ్ టి టీమ్ అధికారులు వాహనాల తనిఖీల్లో రూ.79000 స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగదుకు తగిన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి ట్రెజరీకి పంపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల పైబడి నగదుతో ప్రయాణించేవారు అందుకు తగిన ఆధారాలను తనిఖీ అధికారులకు చూపించి సహకరించాలని రిటర్నింగ్ అధికారి ఖాజావలి విజ్ఞప్తి చేశారు.
తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉండి MLA టికెట్ తనకేనని చంద్రబాబు చెప్పలేదు. రామరాజుకేనని కూడా చెప్పలేదు. తప్పకుండా పోటీలో ఉంటా. నేను కండీషన్లు పెట్టి టీడీపీలో చేరలేదు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. MPగా పోటీ చేస్తానా..? MLAగానా..? అనేది కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారు.’ అని అన్నారు.
పవన్ ఇప్పుడు పోటీ చేస్తున్న 20 సీట్లు త్యాగం చేసి జనసేన పార్టీని మూసివేయండి అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం తణుకులో ఆయన మాట్లాడారు. 2024లో జనసేనను మూసివేసే దిశగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముందుగానే పార్టీని మూసివేసి త్యాగమూర్తిగా చరిత్రలో నిలిచిపోవాలని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడారు.
పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
Sorry, no posts matched your criteria.