WestGodavari

News April 27, 2024

చింతమనేనిపై 93 కేసులు

image

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 93 కేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఒక్క వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 47 కేసులు ఉన్నాయి. వీటిలో 14 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో 13 కేసులు, 2020-21లో 16 కేసులు, 2022లో 7 కేసులు, 2023లో 8 కేసులు, 2024 లో 3 కేసులు నమోదయ్యాయి.

News April 26, 2024

ప.గో.: అమ్మా, నాన్న, ఓ కుమారుడు.. ముగ్గురూ మంత్రులే

image

దెందులూరుకు చెందిన మాగంటి కుటుంబం అరుదైన గుర్తింపు పొందింది. 1989లో కాంగ్రెస్ నుంచి దెందులూరు MLAగా గెలుపొందిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి దేవాదాయ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవిలో ఉండగానే ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి వరలక్ష్మీదేవి గెలిచి మంత్రి అయ్యారు. వారి కుమారుడు మాగంటి బాబు 2004లో MLAగా గెలిచి రెండేళ్ల తర్వాత చిన్ననీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.

News April 26, 2024

పెదపాడు: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పెదపాడు మండలంలోని జయపురం గ్రామంలో భలే జగన్మోహనరావు (32) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిది హత్యా.. లేక కరెంట్ షాక్ తో చనిపోయారా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

News April 26, 2024

ప.గో జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 122 మంది నామినేషన్లు

image

ప.గో.జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గురువారం 67 మంది అభ్యర్థులు 73 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 122 మంది అభ్యర్థులు 206 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు. భీమవరంలో 8 మంది, తాడేపల్లిగూడెంలో 15 మంది , నరసాపురంలో 7, ఆచంటలో 8, తణుకులో 6,  ఉండిలో 10 , పాలకొల్లులో 13 మంది  దాఖలు చేశారు.

News April 26, 2024

ప.గో: నేడు నామినేషన్లు పరిశీలన

image

ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. శుక్రవారం ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని వాటిని తిరస్కరిస్తారు. 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుంది. మే 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు.

News April 26, 2024

ఏలూరు: రెండు లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

image

ఏలూరు నగర శివారు చాటపర్రుకు చెందిన ఈదుపల్లి పవన్ పోతురాజు (28) లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. ఇతను గురువారం లారీలో వెళుతుండగా కొమడవోలు వద్ద వేరే లారీని తప్పించే క్రమంలో ఆ వాహనం డోర్ తగిలి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పోతురాజును సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News April 26, 2024

మే 1వ తేదీన ఏలూరులో జగన్ పర్యటన

image

వైసీపీ అధినేత YS జగన్ మోహన్ రెడ్డి మే 1వ తేదీన ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పర్యటన వివరాలను గురువారం విడుదల చేశారు. 1వ తేదీన (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.

News April 25, 2024

ఏలూరు: రేపటినుండి నామినేషన్ల పరిశీలన

image

ఏలూరు జిల్లాలో గురువారం మొత్తం 71 నామినేషన్లు దాఖలయ్యాయని శాఖ అధికారులు తెలిపారు. వీటిలో పార్లమెంట్ కు 10 సెట్లు, అసెంబ్లీకి 63 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటల నుండి అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు. అటు ఏలూరు పార్లమెంట్, ఏలూరు, నూజివీడు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీ పరిధిలో నామినేషన్లు పడ్డాయన్నారు.

News April 25, 2024

ప.గో.: ACCIDENT.. యువకుడు మృతి

image

ప.గో. జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలకొల్లు నుండి ఇద్దరు యువకులు బైక్‌పై లంకలకోడేరుకు వెళ్తుండగా భగ్గేశ్వరం రైస్‌మిల్లు ప్రాంతంలోకి రాగానే ఇటుక ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొలికెల శ్రీజు అక్కడికక్కడే మరణించాడు. మరొక యువకుడికి తీవ్రగాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. 

News April 25, 2024

ఏలూరు: ఆ MLA అభ్యర్థులు 2 జిల్లాల్లో ప్రచారం చేయాల్సిందే

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏలూరు జిల్లాకు ఉంగుటూరు, గోపాలపురం నియోజకవర్గాలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోకి వచ్చాయి. దీంతో ఆయా చోట్ల పోటీచేసే అభ్యర్థులు 2 జిల్లాల్లో ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
– గణపవరం మండలం వాస్తవానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీకి చెందినదే అయినా జిల్లా మాత్రం ప.గో.
– ద్వారకాతిరుమల మండలం ప.గో. జిల్లా గోపాలపురం అసెంబ్లీకి చెందినదే అయినా జిల్లా మాత్రం ఏలూరు.