India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ బుధవారం తణుకులో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తణుకు పట్టణానికి విచ్చేసిన ఆమె.. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. వెంకటరామయ్య థియేటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి రష్మి గౌతమ్ విచ్చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
ఏలూరు జిల్లాలో బుధవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చోదిమెళ్ల శివారులో పిడుగు పడగా.. పొలం పనులు చేస్తున్న సుబ్బారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు బోరున విలపించారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరులో ఓ వ్యక్తిపై గొడ్డలి దాడి జరిగింది. గ్రామానికి చెందిన చిచ్చడి కృష్ణ(45) అనే వ్యక్తిపై కుర్సం వెంకటేష్ మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ తీవ్ర గాయాలపాలవ్వగా.. చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఏలూరు రైల్వే స్టేషన్ పరిధి తేలప్రోలు రైల్వే స్టేషన్ గేటు సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆది నారాయణ ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుడి చేయిపై ‘అమ్మ’ అని పచ్చ బొట్టు ఉందన్నారు. రైలు ప్రమాదంలో మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాబోయే ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా ఓటింగ్ జరగాలని స్వీప్ నోడల్ ఆఫీసర్ తూతిక విశ్వనాథ్ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి.విజిల్ యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే అధికారుల నుంచి స్పందన వస్తుందని అన్నారు. జిల్లా యంత్రంగం ఈ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులకు సకాలంలో స్పందించి పరిష్కారం చూపుతారన్నారు.
యలమంచిలి మండలం మట్టావానిచెర్వులో ఆరు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన రూ.5.62 లక్షలు వీఓవో తన సొంత ఖర్చులకు వినియోగించుకున్న ఘటన వెలుగులోకొచ్చింది. కాగా గ్రూపు సభ్యులు బ్యాంకును సంప్రదించగా విషయం బయటపడింది. దీంతో సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీఎం విచారణ జరిపి రూ.4.62 లక్షలు వసూలు చేయగా మిగిలిన డబ్బు బుధవారం చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని కేబుల్ ఆపరేటర్లకు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సూచించారు. అభ్యర్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) అనుమతి పొందిన రాజకీయ ప్రకటనలను మాత్రమే ప్రసారం చేయాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎంసీఎంసీ సభ్యులు కె.బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్ష 24,209 మందికి గానూ 23,452 మంది రాశారు. 757 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1342 మందికి 423 మంది హాజరయ్యారు. 919 మంది గైర్హాజరయ్యారు. అటు ప.గో జిల్లాలో 21,462 మందికి గానూ 20,455 మంది హాజరు కాగా.. 1007 మంది ఆబ్సెంట్ అయినట్లు పేర్కొన్నారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1493 మందికి గానూ 69 మంది ఆబ్సెంట్ అయ్యారు.
వంట గ్యాస్ సిలెండర్ల పంపిణీలో అదనంగా వసూలు చేసే గ్యాస్ కంపెనీ డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి హెచ్చరించారు. 15 కిలోమీటర్ల లోపు వరకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరాదన్నారు. కొంతమంది గ్యాస్ సిలెండర్ డెలివరీ బాయ్స్ పంపిణీకి అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వంట గ్యాస్ పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో అధికారులు మంగళవారం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమెకు పెళ్లి చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఇంటికి వెళ్లి అడ్డుకున్నామని జిల్లా బాలల సంరక్షణాధికారి డా.సీహెచ్ సూర్య చక్రవేణి తెలిపారు. అనంతరం బాల్య వివాహల వలన కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు వివరించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.