India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు ఎంపీ స్థానానికి మంగళవారం 3 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉంగుటూరులో 6 సెట్లు, దెందులూరులో 2 సెట్లు, ఏలూరులో 5 సెట్లు, పోలవరంలో 4 సెట్లు, చింతలపూడిలో 2 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 13 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, ఉంగుటూరులో 11, దెందులూరులో 10, ఏలూరులో 12, పోలవరంలో 10, చింతలపూడిలో 9 నామినేషన్లు వచ్చాయి.
➤ నియోజకవర్గం: దెందులూరు
➤ అభ్యర్థి: చింతమనేని ప్రభాకర్ (TDP)
➤ విద్యార్హతలు: డిగ్రీ
➤ చరాస్తి విలువ: రూ.34,93,887
➤భార్య పేరిట రూ.2,15,17,185
➤ స్థిరాస్తులు: రూ.41,85,19,800
➤ భార్య పేరిట రూ.7,12,89,500
➤ కేసులు: 93
➤ అప్పులు: రూ.77,34,471
➤ భార్య పేరిట రూ.1,04,45,990
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
నెల్లూరు జిల్లా కావలి- ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కొయ్యలగూడెం వాసులు మృతి చెందారు. ఒక లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు. చెన్నై నుంచి కొయ్యలగూడెంకు వస్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతులు జ్యోతి కళ్యాణి, రాజీ, కుమార్‌లుగా గుర్తించారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో బుధవారం పలువురు అసెంబ్లీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారిలో పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల గోపి, పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి, నూజివీడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుసు పార్థసారథి, నిడదవోలు కాంగ్రెస్ పెద్దిరెడ్డి సుబ్బారావు నామినేషన్ వేయనున్నారు.
➤ నియోజకవర్గం: ఏలూరు పార్లమెంట్
➤ అభ్యర్థి: కారుమూరి సునీల్ కుమార్ (YCP)
➤ విద్యార్హతలు: బీఏ- బిజినెస్ మేనేజ్ మెంట్
➤ చరాస్తి విలువ: రూ.1.85 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.18.06 కోట్లు
➤ భార్య పేరున: రూ.6.48 కోట్లు
➤ కేసులు: 0
➤అప్పులు: రూ.1.02 కోట్లు
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ పార్టీ నాయకుల ప్రచారం జోరందుకుంది. కూటమి, వైసీపీ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారం చేపడుతూ ముందుకెళ్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 స్థానాలుండగా గత 2019 ఎన్నికల్లో వైసీపీ 13 చోట్ల, టీడీపీ 2చోట్ల విజయం సాధించాయి. మరి ఈ సారి టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు నేపథ్యంలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది. క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి మరో 2 రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో బస్సుయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు.
➤ నియోజకవర్గం: ఉండి
➤ అభ్యర్థి: వేటుకూరి శివరామరాజు (ఇండిపెండెంట్)
➤ చరాస్తులు: రూ.81,58,379
➤ స్థిరాస్తులు: రూ.4,36,07,949
➤ అప్పులు: లేవు
➤ భార్య చరాస్తులు: రూ.50,57,238
➤ భార్య స్థిరాస్తులు: రూ.80,00,000
➤ ఇద్దరి చేతిలో ఉన్న డబ్బులు: రూ.54,000
➤ 4 క్రిమినల్ కేసులు (పెండింగ్)
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.
ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేశారు. ముందుగా ఏలూరు నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలుతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు తరలి వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.