India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.
తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి వారికి మత్తు ఇంజక్షన్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఏలూరు-1 టౌన్ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఫిలిప్పిన్స్‌లో MBBS కోర్స్ చేస్తున్న కొవ్వూరి భానుసుందర్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులపాలయ్యాడు. దీంతో వారిలో ఒకరికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వలన ఒక వ్యక్తి చావుకి కారకుడయ్యాడు. మరో మహిళ ఆసుపత్రిపాలైంది.
ఉమ్మడి జిల్లాలో వర్జీనియా పొగాకు ధర నిలకడగా కొనసాగుతోంది. సోమవారం నాటికి 20 రోజులు వేలం నిర్వహించగా.. ఇప్పటి వరకూ ₹.50.24 కోట్ల విలువైన 21.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1,2 పొగాకు వేలం కేంద్రాల్లో కిలో పొగాకు రూ.240తో వేలం ప్రారంభం కాగా.. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.241 పలుకుతోంది. అయితే ఇది గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు.
మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు అలవాటు పడి ఓ <<12965125>>వ్యక్తి ప్రాణం<<>> తీసిన వైద్యుడి బాగోతం తెలిసిందే. ఆ దొంగ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్రంపాడుకు చెందిన కొవ్వూరి భానుసుందర్ MBBS చదువుతున్నప్పటి నుంచి బెట్టింగ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇలా మత్తు ఇంజక్షన్లు ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. సోమవారం భానుసుందర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో సామాన్యుడికి ఒక నిబంధన ముఖ్యమంత్రికి మరో నిబంధననా అని ఆయన ప్రశ్నించారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులు వేణి, పవన్ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే చనిపోగా వేణికి గాయాలయ్యాయి. భర్త కళ్లముందే చనిపోవడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లాలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చింతలపూడి మార్కెట్ యార్డ్ వెనుక రమేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆయన మృతి చెంది వారం రోజులు అయినట్లు కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. రమేశ్ చింతలపూడి జీబీజీ రోడ్‌లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి 1955 నుంచి 2019 వరకు మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఓ ఎన్నికలో కేవలం 24 ఓట్ల తేడాతో MLA పీఠం చేజిక్కింది. 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాసరావు.. కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై 24 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో MLAగా గెలిచారు. 1955లో పి.కోదండరామయ్య(కాంగ్రెస్) ఎస్.అప్పారావు(సీపీఐ)పై 492 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు.
ప.గో జిల్లాలో ఓ రైతు లేగ దూడ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపారు. పాలకోడేరు మండలం గోరగనమూడికి చెందిన రైతు పంపన రామకృష్ణకు చెందిన లేగ దూడ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్రామంలోని పెద్దలను పిలిచి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. వారందరికీ పంచి పెట్టారు. ఆవు దూడ నా బిడ్డ లాంటిదని రామకృష్ణ తెలిపారు. విస్సకోడేరు సర్పంచ్ బొల్ల శ్రీనివాస్, గొరగనమూడి మాజీ సర్పంచ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.